చిగురుపాటి జయరాం హత్య కేసులో తమ బంధువుల పైనే అనుమానాలున్నాయి అతని భార్య పద్మశ్రీ ఆరోపణ*

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాo హత్య కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో జయరాం బంధువుల పైనే అనుమానాలు ఉన్నాయని అతని భార్య పద్మ శ్రీ ఆరోపించారు.

కేసు విచారణలో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్టు సమాచారం. 2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరాం తనతో చెప్పారని. అమెరికా నుంచి భారత్ కు వచ్చాక, ఇంత గోరంగా చంపుతారు అని ఊహించలేదని పద్మశ్రీ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

సమావేశాలు కోసమే జయరాం అమెరికా నుంచి భారత్ కువచ్చారని చెప్పారు. సొంత అక్క తోనే ప్రాణహాని ఉందని జయరాం చెప్పే వారని పద్మశ్రీ వెల్లడించారు.

మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతోనే ఆమెను ఓ ఛానల్ బాధ్యతల నుంచి తప్పించినట్లు పోలీస్లకు వివరించారు.

మరో వైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లోని రాకేష్ నివాసంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఘటన జరిగిన రోజు దస్పల్లా హోటల్ నుంచి జయరాం ఎక్కడికి వెళ్లారు, అక్కడ ఎవరితో ఉన్నారు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఎంతసేపు గడిపారు.

తదితర విషయాలపై అక్కడ సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు సేకరించారు.

ఈ కేసులో శిఖా చౌదరి ప్రభావం ఎంతవరకు ఉంది? ఆమె ప్రమేయంతోనే హత్య జరిగిందా? .డబ్బుల కోసమే రాకేష్ రెడ్డి జయరాoనుహత్య చేశారా?. అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

జైరాం భార్య పద్మ శ్రీ న్యాయవాది వివేక్ ను కూడా పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక కారణాలతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.

డీజీపీ జయరామ్ హత్య కేసు విచారణకు ఆరు బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ కేసులో చాలా వరకు ఆధారం సేకరించామని. వాటిపై స్పష్టత కూడా వచ్చిందని చెప్పారు.

హైదరాబాదులోని జనవరి 31న రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య లోనె హత్య జరిగిందని, మృతదేహాన్ని కారులో తీసుకొని కృష్ణాజిల్లా కీసర సమీపంలో వదిలి పెట్టారని డిజిపి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *