మమతా బెనర్జీకి అండగా నిలుస్తాను అంటున్న చంద్రబాబు

ఎన్నికల ముందు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను చంద్రబాబు తప్పు పట్టారు. కలకత్తా లో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి అండగా నిలుస్తామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాల ఐక్యత ను జీర్ణించుకోలేక ప్రధానమంత్రి మోడీ కి నైరాశ్యం వచ్చిందని ఎద్దేవా చేశారు.

కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. కేంద్రం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తోందని, రాజకీయ వ్యతిరేక చర్యలు చేయడం ఆందోళనకరమైన విషయం అని అన్నారు.

వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు మోడీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బ్రష్టు పట్టించడానికి మోడీ, షాల చర్యల ఫలితమే అని అన్నారు.

రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం ఏమాత్రం సరైనది కాదు అన్నారు. రాష్ట్రాలను భయపెట్టే చర్యలను మానుకోవాలని అన్నాడు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు తగ్గడం వల్లే ఇలా దిగజారి ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలా అశాంతి సృష్టిస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *