ఎక్స్ప్రెస్ టీవీ చైర్మెన్ చిగురుపాటి జయరాం మర్డర్

ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం .మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

విజయవాడ నగరంలోని కోట్లాది రూపాయల విలువైన భూమి కోసం. కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్నట్లు. పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లోని ఒక గెస్ట్ హౌస్ లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జైరాంకు బీరు లో సైనేడ్ ఇచ్చి హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఎక్స్ప్రెస్ టివి యజమాని, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం నీలం రంగులోకి మారడంతో పోలీసులు కుట్ర కోణం పై ఆరా తీస్తున్నారు.

రక్త నమూనాలను పోరెని క్స్ ల్యాబ్ కు తరలించారు.దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జయరాం .

మేనకోడలు శిఖ చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈమె గతంలో హైదరాబాదులో ఉన్న ఎక్స్ప్రెస్ టీవీ సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు.

రెండేళ్ల క్రితం జయరాం తల్లి మృతి చెంది నప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలైనట్లు సమాచారం. దీంతో పోలీసులు జై రాం కుటుంబం, బంధువులను ప్రశ్నిస్తున్నారు.

జేరామ్ అంతుచిక్కని మరణం వెనుక ఎవరు ఉన్నది, అనే అంశం శిఖచౌదరిని విచారిస్తే తెలిసిపోతుందని. పోలీసులు సందేహిస్తున్న టు తెలుస్తోంది..జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసరగ్రామం వద్ద ఆయన కారులో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన కారులో మృతదేహం చూసి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.నందిగామ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్, నంది గ్రామ గ్రామీణ సి ఐ సతీష్ లు .

ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కారులో లభ్యమైన డాక్యుమెంటలను బట్టి జయరాం గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *