అవినీతి బాబును గద్దె దించండి ఏపీ ప్రజలకు అమిత్ షా పిలుపు*

అవకాశవాదానికి నిలువెత్తు రూపమైన చంద్రబాబును మళ్లీ ఏపీలో అధికారంలోకి రానీ వద్దని .బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రజలకు పిలుపునిచ్చారు.
విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బి జె పి లక్ష్యం గా ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం, విశాఖపట్నం, పాడేరు, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న శక్తి కేంద్రాల్లో ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనంతా అవినీతి, అవకతవకలమయoగ ఉందన్నారు. బాబు రాజకీయ అవకాశవాదం ఏ స్థాయిలో ఉంటుంది అంటే, కాంగ్రెస్ తొపొత్తు పెట్టుకోవడమే అందుకు ఉదాహరణ అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టిడిపి ఆవిర్భవించింది. అటువంటి పార్టీతో టిడిపిని కలిపిన పాపం అచ్చంగా చంద్రబాబుదేనని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు అధికారం కోల్పోయి పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని భావించి ,మరల ఎన్డీఏ తో జత కట్టారని అని గుర్తు చేశారు.
నాలుగేళ్ల తరువాత ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందొ ఆ పార్టీతోనే జతకట్టిన పరిస్థితికి చంద్రబాబు వచ్చారని ఎద్దేవ చేశారు.
తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎన్డీఏలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయడం ఖాయమని.
అయితే ఆయన్ని మరో సారి NDA లోకి రానివ్వమని అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఆయనకునకు తలుపులు పూర్తిగా మూసెసిందని చెప్పుకొచ్చారు.
ఏపీలో 20కి పైగా విద్యాసంస్థలను అనేక ఇతర సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.
ఈ విషయంలో ఏపీకి అన్యాయం చేసినట్లుగా, చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.