జనసేన పార్టీ తరఫున ఇద్దరు అధికార ప్రతినిధులను.. పవన్ కళ్యాణ్ నియమించారు

జనసేనలో కీలక నియామకాలు.. విద్యావేత్త, జర్నలిస్టుకు పదవులు

జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు.

టీవీ చర్చా కార్యక్రమాల్లో జనసేన పార్టీ గొంతు గట్టిగా వినిపించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జనసేన పార్టీ తరఫున ఇద్దరు అధికార ప్రతినిధులను నియమిస్తున్నట్లు ఆదివారం పార్టీ ప్రకటించింది.

ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.

టీవీ చానెల్స్ డిబేట్స్‌లో జనసేన తరఫున పాల్గొనేందుకు విద్యా కోవిదుడు కోటమరాజు శరత్ కుమార్, పాత్రికేయుడు పి.వివేక్ బాబును ప్రతినిధులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ నియమించారని ఆయన పేర్కొన్నారు.

విజయవాడకు చెందిన శరత్ కుమార్ (42) ఎంటెక్, ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ పట్టభద్రులలు. ప్రస్తుతం ఆయన అధ్యాపకుడిగా పని చేస్తున్నారు.

అలాగే కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వివేక్ బాబు (40) విశాఖపట్నంలో స్థిరపడ్డారు. బీటెక్ చదివారు.

కొంత కాలం పాటు ఓ న్యూస్ చానల్‌కు రిపోర్టర్‌గా పని చేశారు. జనసేన ప్రతినిధులుగా నియమితులైన వీరిద్దరికీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *