విశాఖలో కరోనా డేంజర్ బెల్స్.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

విశాఖలో కరోనా డేంజర్ బెల్స్.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
ఈ జోన్లలో చాలా ప్రాంతాల నుంచి కేసులు వస్తుండటంతో కంటైన్మెంట్‌లు చేయడానికి కష్టమవుతోంది.
ఈ ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
విశాఖలో కరోనా పంజా విసురుతోంది. నగరంలో కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జోన్-2, జోన్-3లో టెస్టులు చేస్తున్నకొద్దీ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది.
జీవీఎంసీ నుంచి బృందాలు జోన్-2, జోన్-3 ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాయి.
ఆగస్టు 31 వరకూ తేలిన లెక్కల ప్రకారం గత రెండు వారాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగర వ్యాప్తంగా 46 వెరీయాక్టివ్ క్లస్టర్లు, 52 యాక్టివ్ క్లస్టర్లు ఉన్నాయి.
కేవలం వీటి ద్వారానే 14 రోజుల వ్యవధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ క్లస్టర్లన్నీ కూడా జోన్-2, జోన్-3కి చెందినవేనట.
నగరంలో ఎక్కడాలేనన్ని రద్దీ ప్రాంతాలు కేవలం జోన్-2,3ల్లోనే ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, బీచ్ ఇతర విడిది ప్రాంతాలు ఎక్కువ.
ఫిషింగ్‌హార్బర్, జాలారిపేట, జగదాంబకూడలి, పూర్ణామార్కెట్, అల్లిపురం మార్కెట్, డాబాగార్డెన్, స్ప్రింగ్‌రోడ్ వంటి ప్రాంతాల్లో రద్దీ ఎక్కువ. కేసుల పెరగడంపై ఆరా తీసిన అధికారులు కొన్ని అంశాలను గమనించారు.
ప్రస్తుతం కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో జనాలు ఎక్కువమంది ఉన్నారు. వీధులు, ఇళ్లు చాలా వరకు కిక్కిరిసి ఉన్నాయి.
జాలారిపేట, పెదజాలారిపేట, కేఆర్‌ఎంకాలనీ, అప్పూగర్, మద్దిపాలెం, చినవాల్తేరు లాంటి ప్రాంతాల్లో ఇదే తేలింది. నగరంలో ఇతరప్రాంతాలతో పోల్చితే ఇక్కడే జనసంచారం ఎక్కువగా ఉంది.
దీనికి తోడు బయట తిరుగుతున్న జనాల్లో చాలామంది జాగ్రత్త తీసుకోవట్లేదు. మాస్క్‌లు కూడా సరిగా వాడట్లేదు.. చాలామంది దగ్గర శానిటైజర్లు కూడా లేవు.. వైరస్ సోకకుండా కనీస చర్యలు లేకపోవడమే కారణమని తేల్చారు.
ఈ జోన్లలో చాలా ప్రాంతాల నుంచి కేసులు వస్తుండటంతో కంటైన్మెంట్‌లు చేయడానికి కష్టమవుతోంది.
ఈ ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌లు తప్పనిసరి ఉపయోగించాలని.. భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు.
ప్రజలు తమకు సహకరించాలన్నారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేదానిపై ప్రణాళికల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.