మిస్టరీ వీడబోతున్న జయరాం హత్య విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరా హత్య కేసు మిస్టరీ ఒక రా కొలిక్కి రానుంది.

ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణ చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురుని విచారించినట్లు తెలుస్తోంది.

ఆయన మేనకోడలు శిఖా చౌదరి, అతని స్నేహితుడు రాకేష్ రెడ్డి ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

రాకేష్ రెడ్డి తానే జయరాం ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఆర్థిక లావాదేవీలు వ్యవహారంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న భేదాభిప్రాయాల వల్ల జయరాం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఇక శిఖా చౌదరి తో తనకు పరిచయమున్న వాస్తవమేనని, అది పెళ్లి వరకు కూడా వెళ్ళింది అని చెప్పాడు.

అయితే అనేక మందితో సంబంధాలు ఉన్నాయని తెలిసి పెళ్లి చేసుకోలేదని చెప్పాడు.

కుక్కలు ఇచ్చే మత్తు ఇంజక్షన్ జయరాం కు ఇవ్వడం ద్వారా హత్య జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు.

అయితే ఏ విధంగా ఇచ్చారన్నది ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

శిఖా చౌదరి తన మామ తో ఉన్న సంబంధం వ్యక్తిగతమైని పోలీస్ విచారణలో తెలిపారు. రాకేష్ రెడ్డి ని ఆమె పరిచయం చేసినట్లు కూడా చెప్పారు. రాకేష్ రెడ్డి
జయరాం కు నాలుగున్నర కోట్ల అప్పుగా ఇచ్చారన్నారు. ఆ డబ్బును జయరామ్ రాకేష్ కి తిరిగి ఇవ్వలేదన్నారు. ఈ విషయం మీదనే వారిద్దరి మీద భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.

జయరాం భార్య పద్మశ్రీ స్టేట్మెంట్ అని కూడా పోలీసులు రికార్డు చేశారు. శిఖా చౌదరి తనకు పరిచయం ఉందని ఆమె చెప్పారు.

రాకేష్ రెడ్డి ఎవరో తెలియదని అన్నారు. ఐదేళ్లుగా శిఖా చౌదరి తో పరిచయం ఉంది అని చెప్పారు.

తనకు పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు.

ఈనెల ఒకటో తారీఖున కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో ఐతవరం వద్ద ఓ కారు లో జయరాం మృతదేహాన్ని కనుగొన్నారు.

పోలీసులు జాతీయ రహదారి పక్కనే కారు దిగబడిపోయి ఉండటాన్ని గుర్తించారు. వెనక సీట్లో మృతదేహం పడి ఉండగా అది ప్రముఖ పారిశ్రామికవేత్త ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ జయరాం గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed