బీసీలను దూరం చేసే కుట్ర, వైసీపీ టీఆర్ఎస్ పై మండిపడ్డ చంద్రబాబు

Chandrababu Changes Colours Like Chameleon

Chandrababu Changes Colours Like Chameleon

అమరావతి: ఎం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారిని ఒకొకరు రాష్ట్రానికి వస్తున్నారని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులు చేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరున్నారు.

టీడీపీ నేతలతో సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. కోల్కటా లో నిర్వహించిన విపక్షాలు సభకు 10 లక్షల మందికి పైగా తరలివచ్చారని. అమరావతిలో నిర్వహించే ధర్మ పోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు.

ప్రధాని మోడీ పాలనలో సంక్షేమం పడకేసిందని , బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ నిందించారని.. ‘రాజా ఆఫ్ కరష్షన్’ పుస్తకం పై కేసీఆర్ దే రెండో సంతకం అని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్ వైఎస్ను కొడుతున్నారని విమర్శించారు.

బీసీలో అపోహలు తేవాలని వైసీపీ , టీఆరెఎస్ కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోడీ డైరెక్షన్లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను టీడీపీకి దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని.

ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. చిత్తూరుకు కృష్ణాజిలాలు రావడం ఒక చరిత్ర అని. కృష్ణా జిల్లాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు.

నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలమని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు. ప్రతిపక్షం పూర్తిగా డీలా పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *