ఎన్ఐఏ గరుడపురాణం – NIA Garuda Author Sivaji

వైయస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో విచారణను వేగవంతంగా సాగిస్తున్న ఎన్ఐఏ. ఈ కేసు విచారణలో భాగంగా గరుడపురాణం నటుడి మీద కూడా కన్నేసినట్టు గా తెలుస్తోంది.

ఏపీలో ఒక ప్రముఖ రాజకీయ నేత పై ప్రాణహాని లేని విధంగా దాడి జరుగుతుందని అతడు చాన్నాళ్ల కిందటే చేశాడు. ఆపరేషన్ గరుడ అంటూ చెప్పాడు.

అది తనకు ఎలా తెలిసింది?
అంటే ఢిల్లీలో టీ కొట్టులో ఎవరో అనుకుంటే తాను విన్నట్టుగా అతడు కామెడీ చేశాడు. ఇతడు కామెడీ ఫైలోనా లేక కన్నింగ్ ఫెలోనా అనేది ఇప్పుడు ఒక కొశ్చన్ మార్క్ గా నిలుస్తోంది.

మొదట్లో కామెడీ అనుకున్నారు కానీ, జగన్ మీద హత్యాయత్నం తర్వాత మాత్రం ఇతడి తీరు వివాదాస్పదం అయ్యింది. ఆ ఘటన జరిగే సమయానికి, ఘటన జరిగిన తర్వాత ఇతడు చాన్నాళ్ల పాటు ఏపీ వైపు రాలేదు.

అమెరికాలో కూర్చున్నాడట. ఇతడు చిలకజో స్యంలా చెప్పిన గరుడ పురాణం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ జరుగుతున్న ఎన్ఐఏ ఇప్పుడు ఇతడిని విచారించడం కూడా తప్పనిసరి అని తెలుస్తోంది.

ఇతడిని ఎన్ఐఏ విచారించడం తోనే అసలు కథ మలుపు తిరుగుతుందనే మాట వినిపిస్తోంది. దాడి జరుగుతుంది నీకెలా తెలిసింది? అనే ప్రశ్న ఒకటి చాలు ఈ కేసు మలుపు తిరగడానికి. దానికి ఎన్ఐఏ అధికారులు తమదైన రీతిలో విచారించి సమాధానం రాబడితే.

ఆ తర్వాత కొన్ని పెద్దతలలు ఈ కేసు విచారణ పరిధిలోకి వస్తాయని సమాచారం అందుకే వీలైనంత త్వరగా ఈ కేసులో ఎన్ఐఏ విచారణను ఆపించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Operation Garuda On Chandrababu; Shivaji putting Chandrababu in trouble?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *