తమ ఎన్నికల గుర్తుగా ఉన్న సైకల్ ను పట్టుమని పది కిలోమీటర్ల కూడా తొక్కలేదని లోకేష్ పై జనసేన అధినేత పవన్ జోకులు

ఎన్నికలు దగ్గర పడటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంల్లో పదును పెంచుతున్నారు.ప్రత్యర్థి పార్టీల నేతలపై ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు వారిపై జోకులు పేలుస్తున్నారు. జనసేన సైనికులు నవ్విస్తున్నారు.

తాజాగా జనసేన పార్టీ యాత్రలో భాగంగా ఓ ప్రచార ర్యాలీ లో ప్రసంగించిన పవన్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పై తనదైన శైలిలో ఫన్నీ కామెంట్ చేశారు. నేతలు చూపించే దారిలోని ప్రజలు నడుస్తారని పవన్ ఉన్నారు. కాబట్టి నేతలు సన్మార్గంలో నడవాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ ప్రజలకు సరైన మార్గ నిర్దేశనం చేయడం లేదని ఆరోపించారు. వాళ్లని మహాత్మా గాంధీ లో బి.ఆర్ అంబేద్కర్ లు కాదని వ్యాఖ్యానించారు. లోకేష్ విషయాన్ని ప్రస్తావిస్తూ అతడు ఏమైనా నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.

టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్.

ఈ విషయాన్ని పవన్ ప్రస్తావిస్తూ. తమ ఎన్నికల గుర్తుగా ఉన్న సైకిల్ను లోకేష్ పట్టుమని పది కిలోమీటర్ల కూడా తొక్కలేడని ఎద్దేవా చేశారు. దీంతో ర్యాలీ కి హాజరైన జనమంతా చాలాసేపు నవ్వుకున్నారు.

రిక్షావాలా జిందాబాద్ అనే నినాదం తరహాలో సైకిల్ వాలా జిందాబాద్ అని నినాదాలు చేయిస్తూ లోకేష్ తో కోనసీమ అంతటా సైకిల్ తొక్కించాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ లోకేష్ సైకిల్ యాత్ర చేపడితే. వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా ఇసుక రీచ్ కనిపిస్తే అక్కడ ఆగుతారని పవన్ జోస్యం చెప్పారు.

ఇసుక రీచ్ దగ్గర ఉన్న వాళ్ల నుంచి ముడుపులు స్వీకరించి ఆపై అక్కణ్నుంచి లోకేష్ ముందుకు కదులుతారని పేర్కొన్నారు. మరో రీచ్ దగ్గరికెళ్లి అక్కడా అలాగే డబ్బులు వసూలు చేసుకుంటారని ఆరోపించారు. ఏపీ కోరుకునేది ఇలాంటి నాయకులనా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *