కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాలకులకు అనారోగ్యం వెంటాడుతోంది

ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ క్యాన్సర్ బారిన పడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా అనారోగ్యం గురయ్యారు, ఆయన స్వైన్ ఫ్లూ తో బాధపడుతు విమస లో జాయిన్ అయ్యారు. మరోవైపు 66 ఏళ్ల కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ సైతం క్యాన్సర్తో బాధపడుతూ , మృదు కణాల క్యాన్సర్, ఫలితంగా ఆయన తొడ భాగంలో కంది ఏర్పడింది. ఈ కారణంగా అయినా రెండు వారాల పాటు సెలవు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకున్నారని బిజెపి వర్గాలు తెలియజేశాయి.

నిజానికి అరుణ్ జైట్లీ గత ఏడాది మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నారు. అయినా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు క్యాన్సర్ కు chemotherapy ఇస్తూ శాస్త్ర చికిత్స కూడా చేస్తే ఆ భారాన్ని అయినా మూత్రపిండాలు తట్టుకోలేదని, దీనివలన ఇతరత్రా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అక్కడి డాక్టర్లు ఆయనకు శాస్త్ర చికిత్స చేయకపోవచ్చని, కొన్ని మందులు మాత్రం ఇచ్చి తగు జాగ్రత్తలు చెప్పి బిచ్చ చేయవచ్చని సంబంధిత వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు తీవ్ర అనారోగ్యాల బారిన పడ్డారు. వీరిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈమెకు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ కూడా క్లోమ క్యాన్సర్ బారినపడి నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందారు.

అలాగే కేంద్ర రసాయనాలు ఎరువులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వహించిన అనంతకుమార్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో గత ఏడాది కనుమూశారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ హృద్రోగంతో 2017 లో తుది శ్వాస విడిచారు. ఈ విధంగా బిజెపి పాలకులకు ఈవిధంగా అనారోగ్యాలు వెంటాడుతున్నయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed