ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగు ఎంపీలంతా ఏకతాటి పైకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ముఖ్యమని, ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలంటే మనకు మద్దతుగా పార్లమెంటులో తెలుగు రాష్ట్రాలు ఎంపీల సంఖ్య పెరగడమే మార్గమని స్పష్టం చేశారు. ఏపీ హోదా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ స్థాయిలో తరలిరండి ఏర్పాటులో భాగంగా టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చర్చించారు. అనంతరం వైఎస్ జగన్, కేటీఆర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో తమ అభిప్రాయం ఇప్పటికే స్పష్టంగా చెప్పామని. రెండో మాటకు తావు లేదని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వారి ప్రయోజనాలను కాపాడుకొనేందుకే ఫెడరల్ ఫ్రంట్ కృషి చేస్తుందని చెప్పారు. కేటీఆర్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు లోటస్ పాండ్ కు వచ్చి గంటకు పైగా చర్చలు జరిపారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై గట్టిగా నిలబడవలసిన అవసరం గురించి చర్చించారు. అన్యాయాలు జరగకూడదంటే రాష్ట్రాలు అన్ని కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వెలిబుచ్చారు. మన రాష్ట్రంలోని 25 మంది లోక్సభ ఎంపీ లతో మన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

మన 25మందికి మరో 17 మంది తెలంగాణ ఎంపీలు తోడైతే మొత్తం 42 మంది ఒక తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ జరిగింది స్పందించగలిగితే , ఈ 42 మంది ఎంపీలు ఒకేసారి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పగలిగితే రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది. రాష్ట్ర లా హక్కులు నిలబడాలి పరిరక్షించుకోవాలి అంటే సంఖ్యాపరంగా పెరగాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు జంకుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఎంపీల పరంగా ఏకమై తమకు జరుగుతున్న అన్యాయాలపై ఎలుగెత్తి చాటి పరిస్థితి రావాలి.

రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నించడం హర్షించదగ్గ విషయమని జగన్ పేర్కొన్నారు. కేటీఆర్ కూడా మా వద్దకు వచ్చి ఆ విషయాలు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ వైఖరి తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని కేటీఆర్ తెలిపారు. ఏపీ ప్రజలకు అప్పటి ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టాలని చెప్పాం. కనుక ఆ విషయంలో రెండో అభిప్రాయం కానీ ఆలోచన గానీ మాకు లేదు . తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా ఎలా పోరాడాలి అనే విషయంపై కేసిఆర్ స్వయంగా ఏపీకి వచ్చి జగన్తో అన్ని విషయాలపై చర్చిస్తారని కేటీఆర్ తెలిపారు.

ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న ఏమి సాధించుకోలేని పరిస్థితి ఉందని, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని టిఆర్ఎస్ భావిస్తుండగా, విభజనతో దారుణంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధన ప్రధాన లక్ష్యం అనే ప్రతిపాదన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమాలోచనలు జరిపారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపి కాంగ్రెస్ దారుణంగా మోసగించే అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి జాతీయ పార్టీల పై ఆధారపడటం కన్నా ప్రాంతీయ పార్టీలు ఒక బలమైన శక్తిగా రూపుదిద్ది కోవాలనే అభిప్రాయం వైయస్సార్ కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతల మధ్య జరిగిన చర్చల్లో వెల్లడైంద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed