మైలవరం విషయంలో… దొరికిపోయిన టిడిపి!

ఎన్నికల సమయంలో తమకు సహకరించాల్సిందిగా కోరుతూ స్థానిక పోలీసులకు లంచాలు ఇవ్వబోయారని మైలవరం నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టబోయి నా వ్యవహారంపై అడ్డం తిరిగింది.

వైఎస్సార్ సీపీ నేతలు తమకు లంచాలు ఇవ్వబోయారు అని పోలీసులే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సహకరించాలని… నియోజకవర్గం పరిధిలోని ఎస్ ఐ లు అస్పక్, శ్రీనివాసులు కేసులు నమోదు చేసారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఇంచార్జ్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై ఈ కేసును నమోదు చేసేందుకు ప్రయత్నించారు.

అయితే ఈ వ్యవహారం అంటే రాజకీయ ప్రేరేపితం, తెలుగుదేశం పార్టీ నేతలు సూచనల మేరకు సదరు ఎస్ఐలు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టబోయే పోలీస్ శాఖ అంతర్గత విచారణలో తేలింది.

ఈ మేరకు జిల్లా ఎస్పీ త్రిపాఠి సదరు ఎస్సైలపై చర్యలు కూడా తీసుకోవడం గమనార్హం.ఆ ఎస్ఐలు ఇద్దరిని వీఆర్ కు పంపిస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం విశేషం.

మైలవరం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో మొత్తం వ్యవహారం నడిచిందని ఇలా స్పష్టం అయ్యింది.

ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ కి వెళ్ళినప్పుడు ఎన్నికల్లో పోలీసులు పాత్ర గురించి ఫిర్యాదు చేశారు.

సొంత కులానికి చెందిన వారికి చంద్రబాబు నాయుడు ప్రమోషన్లు ఇచ్చి ఎన్నికల సమయంలో వారిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని జగన్ ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు చేసిన కొన్న గంటల్లోనే మైలవరంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. వైసీపీ నేతల పై పోలీసులు ఆరోపణలు చేశారు.

అయితే అంతర్గత విచారణ లో రాజకీయంలో సదరు పోలీసులు పావులు అయ్యారని స్పష్టమయింది.

సదరు ఎస్ఐలపై చర్యలు చోటు చేసుకున్నాయి. దీన్నిబట్టి ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థను తెలుగుదేశం పార్టీ ఎలా ఉపయోగించుకుంటుంది సుస్పష్టం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *