జగన్ ‘డ్రామా’ ఎప్పుడు నేర్చుకుంటాడో?

నికార్సుగా, నిర్మొహమాటంగా ఉండటం మంచిదే కావచ్చు, మంచి లక్షణాలే కావచ్చు, వ్యక్తిగతంగా చూసుకుంటే మంచిదే..కానీ పబ్లిక్ లైఫ్ లో అందులో రాజకీయాల్లో కాస్తయినా డ్రామా, లౌక్యం ఇలాంటివి ఉండాలి కదా.
అందునా అవతలి వాళ్ళ దగ్గర పది రూపాయల ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు.. ఇవతల వాళ్లు కనీసం పది పైసలు అయినా అలవర్చుకోవాలి.
ఇదంతా ఎందుకు మనం ప్రస్తావించుకోవాల్సిన స్తుంది అంటే…
జగన్ మాట తీరు బట్టే..
జగన్ తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రపై 15 కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమా తీశారు.
అది వారి ఆనందం కావచ్చు..
సినిమా చూస్తే వైకాపాకు పూర్తిగా పనికి వచ్చేలా తయారైంది.
పక్కగా ప్రచారానికి పనికి వస్తుంది.
నిజానికి తన తండ్రి మీద తన పార్టీకి పనికి వచ్చేలా తీసిన సినిమా కాబట్టి, జగన్ మొదటి రోజు సినిమా చూడడానికి ఏర్పాట్లు చేయమని యూనిట్ ను అడగాలి… కానీ అడగలేదు..

పోనీ నిర్మాత, దర్శకులు వెళ్లి అడిగిన తర్వాత అయినా, సరే చూస్తాను అని వెళ్ళాలి.. ప్రస్తుతం వేరే పనుల్లో, కమిట్ మెంట్ లతో బిజీగా ఉన్నాను, వీలు చేసుకుని చూస్తాను అని చెప్పారు.
దాంతో సోషల్ మీడియాలో వీలైన చోటల్లా, తండ్రి మీద తీసిన సినిమా చూడడానికి కూడా జగన్ కు టైం లేదా, ఆసక్తి లేదా అనేలా కామెంట్లు కురిపించారు.
అదే జగన్ పదండి చూస్తాను అని, లేదా ఈ రాత్రికి చూస్తాను అని , ఇలా ఏదైనా చెప్పవచ్చు. అప్పుడు ఈ కామెంట్లకి అవకాశం ఉండేది కాదు కదా.
అదేవిధంగా జగన్ కనుక విజయవాడలోనో, విశాఖలో ను థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే వచ్చే బజ్ నే వేరు.. అది సినిమాకు కూడా ఉపయోగపడుతుంది.
ఇవన్నీ చేయడం అన్నది మనిషికి వ్యక్తిగతంగా in builded. కాస్త డ్రామా చేయడం అలవాటు ఉంటే వస్తుంది.
కానీ జగన్ కు అది ఏ కోశానా లేదు మరి ..అదే కదా సమస్య..