చంద్రబాబు ఎలా నెగ్గుకొస్తున్నారో నాకస్సలు అర్ధం అవ్వటం లేదు… ఆజాద్

Kamma brothers suspects other caste voters
రాష్ట్రం తీవ్రంగా ఆర్థికం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇంత సమర్థవంతంగా నెగ్గుకొని వస్తున్నారు న నాకు అర్థం కావటం లేదు… వేరే ఒకరు సీఎం పదవిలో ఉండి ఉంటే ప్రత్యేక హోదా ఇస్తేనే కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేము అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయే ఉండేవారు.
చంద్రబాబు గారు నాకు 70వ దశకం చివరిలో యువజన కాంగ్రెస్ లో ఉన్న అప్పటినుంచి తెలుసు. ఆయన వివాహానికి ఇక్కడున్న వారిలో ఎంత మంది హాజరయ్యారు తెలియదు. నేను మాత్రం మద్రాసులో మూడు రోజులు పాల్గొన్నాను. రాజకీయంగా మా మధ్య విభేదాలు ఉండవచ్చు. కానీ వ్యక్తిగతంగా పరస్పరం గౌరవించుకుంటాం.
జవహర్లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ హయం వరకు… కొత్తగా ఏర్పడే ఏ రాష్ట్రమైనా సొంత రాజధాని నిర్మించుకోవడానికి కేంద్రం నష్టపరిహారం చెల్లించేది. ఏ కొత్త రాష్ట్రమైన 0 నుంచి మొదల పెట్టవలసింది కదా… ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి కూడా ఇదే పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రాజ్య సభలో ప్రకటించారు.
ప్రత్యేక హోదా కేవలం డబ్బు లు మాత్రమే తీసుకురాదు. ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి మార్గంలోకి నడుపుతుంది. కానీ మోడీ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగింది ప్రత్యేక హోదా హామీ తోనే కదా… రాజకీయంగా దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారతంలో ఇతర ప్రభుత్వాల మనోభావాలను గౌరవించని ఏకైక ప్రధాన మోదీ… దేశ సమైక్యత, సమగ్రతను,సంక్షేమం పట్టవు. రైతుల మనసుని అర్థం చేసుకోలేని, రైతుల గోడుని కూడా పట్టించుకోని తొలి ప్రధాని కూడా మోదీ.. గారె..