రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చు…. స్వరూపానందేంద్రకు యామిని సలహా

రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చు. చంద్రబాబుపై కేసు వేస్తాననడం విడ్డూరంగా ఉంది. జగన్‌పై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల గురించి స్వామికి తెలియదా. కేసీఆర్‌కు యాగాలు చేసే స్వామి.. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కూడా మాట్లాడాలి.

స్వరూపానందేంద్ర స్వామికి యామిని కౌంటర్ఏపీకి మోకాలడ్డుతున్న కేసీఆర్‌కు యాగాలు చేస్తారారాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు హర్షించరు

ప్రవచనాలు చెప్పాల్సిన స్వామీజీ.. రాజకీయాలు బోధించడం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. రాజకీయాలు చేయాలంటే స్వరూపానందేంద్ర సరస్వతి పీఠాధిపతి పదవి వదిలేసి… వైసీపీలో చేరొచ్చని సూచించారు.

పీఠాధిపతిగా ఉండి వైసీపీకి అనుకూలంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు వేస్తానని స్వరూపానందేంద్ర చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబుపై స్వామి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

రాజకీయాల గురించి మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర.. విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు యామిని.

పొరుగు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్‌కు యాగాలు చేసిన స్వామి.. ఏపీకి న్యాయంగా రావాల్సిన కరెంట్ బకాయిలు రూ.5వేలకోట్లు వచ్చేలా చూడాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు మోకాలడ్డుతున్న కేసీఆర్‌కు స్వరూపానందేంద్ర యాగాలు చేయడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌లో ఉన్నా అభివృద్ది చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమన్నారు యామిని.

జగన్ చేసిన అవినీతి, ఆయనపై ఉన్న కేసులు స్వామికి కనపడకపోవడం విడ్డూరంగా ఉందని.. దేవుడు పేరు చెప్పుకొని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు హర్షించరన్నారు.

ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed