విశాఖలో వైభవంగా టీఎస్సార్ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం దిగి వచ్చిన తార లోకం

అది రే నృత్యాలు, అందాల తారల హోయలు, అభిమానం నటీనటుల సందడితో పోర్టు స్టేడియం మారుమోగిపోయింది. టి.సుబ్బరామిరెడ్డి ,లలిత కళాపరిషత్ సమర్పణలో , టీఎస్సార్ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఆదివారం రాత్రి పోర్టు స్టేడియంలో నిర్వహించారు.

2017 ,2018 సంవత్సరాల్లో సినీ రంగంలో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా దాని యా, ప్రగ్యా జైస్వాల్ ,రూ కార్స్, పూజా ఝవేరి, శ్రద్ధాదాస్, బృందాలు నృత్యాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించారు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా విశాఖలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి శ్రీదేవి స్మారక అవార్డు దాసరి నారాయణ రావు స్మారక అవార్డు లను అందజేస్తున్నట్లు చెప్పారు.

సిఆర్పిఎఫ్ జవాన్లు మృతికి సంతాపం కార్యక్రమంలో తొలుతకాశ్మీర్లో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని అంతా మౌనం పాటించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రసంగాల్లో అమర జవానులను స్మరించుకున్నారు.

TSR TV9 National Awards 2019

వారి త్యాగాలను మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మోహన్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి గుర్తు చేసుకున్నారు వారి కుటుంబాలకు అండగా ఉండాలని స్ఫూర్తి కలిగించారు. నాగార్జున మాట్లాడుతూ విశాఖకు రావడం ఎంతో ఇష్టం, కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను చూస్తుంటే ఆనందం వస్తుంది అంటూ మాట్లాడారు. అందమైన విశాఖ మాదిరే ఇక్కడ ప్రజలు అంతే బాగుంటారు.

హీరో విశాల్ మాట్లాడుతూ ఇదొక గొప్ప అవకాశం విశాఖలో ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం మర్చిపోలేను. ముఖ్యంగా చిత్రసీమ అగ్ర కథానాయకులంతా ఒకే వేదిక మీద ఉన్న సమయంలో వారందరి మధ్య అవార్డు తీసుకోవడం గర్వంగా ఉందన్నారు.

బోనీ కపూర్ సమక్షంలో విద్యాబాలన్ కు శ్రీదేవి స్మారక అవార్డును అందజేస్తున్నప్పుడు వేదిక మీద ఉన్న వారంతా ఒక్క క్షణం విషాదం లోకి వెళ్ళిపోయారు, విద్యాబాలన్ ఏకంగా కంటతడి పెట్టారు. ఆమె పక్కన ఉన్న చిరంజీవి, బోనీకపూర్ ,బాలకృష్ణ తదితరులు కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయారు.

రామ్ చరణ్ తరపున చిరంజీవి అవార్డును అందుకున్నారు, చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్ తరఫున అవార్డు తీసుకోవడం గర్వంగా ఉందని రంగస్థలం సినిమా లో తన నటనకు పీదా అయ్యాన ని అని చెప్పారు.

నాగచైతన్య అఖిల్ తరఫున హీరో నాగార్జున అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ మహానటి సినిమాలో పాత్రకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోగా, ఆయన మనవరాలు సాయి తేజస్విని అదే సినిమాలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

Highlights of the TSR Awards 2019

అర్జున్ రెడ్డి లో నటించిన శాలిని పాండే, టాక్సీవాలా లో నటించిన ప్రియాంక జవాల్కర్ ఉత్తమ నూతన నటి మణులుగా అవార్డులు అందుకున్నారు. అనేకమంది తారలు కలిసి రావడంతో ప్రేక్షకులు కేరింతలతో సందడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *