మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా విశాఖలో “విత్” ఏర్పాటవుతుంది

మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలో లేని విధంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ హబ్ ఏర్పాటవుతుంది. విశాఖలోని ఆనందపురం మండలం గిరిజాల లో 55 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మహిళా పారిశ్రామిక వాడలోని ఐదెకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఎలీప్( అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా) భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యం కల్పించనున్నారు.

సంప్రదాయ పరిశ్రమలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉన్న అవకాశాలను ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు వివరిస్తారు. అంతర్జాతీయ పరిశ్రమలు అనుసరిస్తున్న అధునాతన పరిజ్ఞానంపై నిపుణులతో అవగాహన కల్పిస్తారు.

ఫుడ్ ప్రాసెసింగ్ ,బయోటెక్నాలజీ, ఫార్మా తదితర రంగాల్లో మహిళలు పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తారు. పారిశ్రామికవేత్తలు గా మారాలని సంకల్పం ఉన్న మహిళలకు పెట్టుబడి ప్రధాన సమస్య ఈ నేపథ్యంలోనే విత్ కేంద్రమే అధునాతన యంత్రాలను నాలుగు కోట్లతో కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతుంది.

వీటిని ఉపయోగించుకొని అవసరమైన ఉత్పత్తులను తయారు చేసుకుని వారి బ్రాండ్ల పేరుతో మార్కెటింగ్ చేసుకోవచ్చు. వ్యాపారం లాభదాయకంగా మారిన తర్వాత సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవాల్సి ఉంటుంది.

మహిళలతో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరింప చేయడానికి వీలుగా విత్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. అభివృద్ధికి కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ 20 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు లిఖితపూర్వక సమాచారని ఎలీప్ ప్రతినిధులకు పంపింది.

K Rama Devi, President of the Association of Lady Entrepreneurs of India, said a 50-acre site was allotted to the trade centre at

Gidijala village for the purpose.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *