జగన్ పిలిచి హామీ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు లో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సభలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు.

బీసీలను చంద్రబాబు అవమానించారన్నారు, బిసిల ఓట్లు కావాలి కానీ, టిక్కెట్లు ఇవ్వరా అన్నారు. ఎన్నో సార్లు ప్రధాని మోడీ ని కలిశానని చెప్పారు, కానీ బీసీల కోసం మాట్లాడారా అని నిలదీశాను తాను బీసీ తీవ్రవాదునని ఆర్ కృష్ణయ్య అన్నారు.

బీసీ డిమాండ్లపై ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను అడిగారని చెప్పారు. బీసీలకు విద్య ముఖ్యమని వైయస్ కోరుకునే వారని చెప్పారు. బిసి అభ్యున్నతికి ఆయన కృషి చేశారని చెప్పారు. బీసీలకు మంచి స్కీములు ప్రవేశపెట్టారని కితాబిచ్చారు.

చట్టసభలలో రిజర్వేషనలకు చొరవ తీసుకోవాలని తాను జగన్ ను కోరాన ని ఆయన చెప్పారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతానని వైసిపి అధినేత హామీ ఇచ్చారన్నారు. పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలను కూడా కలిశానని చెప్పారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీలకు శాశ్వతంగా బాగుపడాలని, వైయస్ రాజశేఖర్రెడ్డి కోరుకునే వారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. వైసిపి బీసీ డిక్లరేషన్ తొ చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు.

బీసీలను చంద్రబాబు అన్ని విధాలుగా అవమానించారని చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్ అని అన్నారు, జగన్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని అన్నారు.

R Krishnaiah Hails YS Jagan

For Being True To His Words

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *