అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు బాలీవుడ్ భామ కరీనా కపూర్ భూపాల్ లో ఎంపిగా పోటీ చేయడం సెంటిమెంట్ కు సెంటిమెంట్, గ్లామర్ కు గ్లామర్ గ్యారంటీ గా వర్కువుట్ అవుతుందనేదే కాంగ్రెస్ ప్లాన్

సినిమాలు తర్వాత రాజకీయాలు. గతంలో ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. రాబోయేది ఎన్నికల సీజన్. ఇంకో నెల రోజుల్లో లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది దీంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఖాళీగా గోళ్లు గిల్లుకుంటున్న బ్యాచ్ మొత్తం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఈ బ్యాచ్ లో బాలీవుడ్ భామ కరీనా కపూర్ కూడా చేరింది అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

కపూర్ ఫ్యామిలీ మొత్తం పంజాబ్ కు చెందిందే కానీ కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ని పెళ్లిచేసుకుంది. సైఫ్ అలీఖాన్ భోపాల్ రాజ వంశస్తుడు మన్సూర్ అలీఖాన్ వారసుడు. దీంతో ఇప్పుడు ఆ రాజవంశానికి కోడలు అయ్యింది. కరీనాకపూర్.

అన్నిటికీ మించి నిన్నటి వరకు కరీనాకు స్టార్ హీరోయిన్. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అనుకుంటుంది. అందుకే గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించే ప్లాన్ చేస్తుంది ఇప్పుడు భూపాల్ సీట్ కరీనాకు ఇస్తే. సెంటిమెంట్ కు సెంటిమెంట్ గ్లామర్ కు గ్లామర్ గ్యారంటీ గా వర్కువుట్ అవుతుందనేదే కాంగ్రెస్ ప్లాన్.

అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం భూపాల్ నుంచి పోటీ చేసేందుకు కరీనా కూడా సిద్ధంగా ఉందట. మరి కాంగ్రెస్ వేసుకున్న ఈ భారీ ప్లాన్ వర్కువుట్ అవుతుందో లేదో వెయిట్ అండ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *