తిరుపతి సమర శంఖారావం లో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్

చంద్రబాబు పాలనలో అన్ని మాయ లేనని జగన్ విమర్శించారు తిరుపతి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమర శంఖారావం లో చంద్రబాబు పాలన పై విమర్శల వర్షం కురిపించారు

జాబు రావాలంటే… బాబు రావాలన్నారు. బాబు వచ్చాడు, కానీ ఎవరికి జాబులు రాలేదు అని అన్నారు.

ఏపీపీఎస్సీ ద్వారా వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పి ఆ విషయాన్నే మొత్తంగా విస్మరించారని అన్నారు

మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన మాట గాలికి వదిలేశారని విమర్శించారు

ఇచ్చిన హామీల్లో ఒక్కటేనా నెరవేరిందా అని చంద్రబాబును నిలదీయండి అని చెప్పారు.

రాష్ట్రంలో పాలన లేదు ప్రజా సంక్షేమమే లేదు. ఇదంతా నేను పాదయాత్రలో గ్రహించాను అని అన్నారు.

వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అడ్డదారులు మొదలు పెట్టాడు అని అన్నారు

సర్వే పేరిట వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్న చంద్రబాబు దానికి అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేయించుకున్నారని విమర్శించారు.

లగడపాటి తో దొంగ సర్వేలు చెప్పించి గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారు అన్నారు

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బదులు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని తనదికాని హయాంలో బడ్జెట్ పెట్టి రైతులపై ప్రేమ కురిపిస్తున్నాడని విమర్శించారు.

ఈ సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed