సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు “అంకెల గారడీ – ఎన్నికల బడ్జెట్” అంటూ సిహెచ్ నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె. లోకనాధం.

శాసనసభలో 2019 20 సంవత్సరానికి రూ. 2,26, 177 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగ రావు అన్నారు. ఎంతో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగాను , ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక తాయిలాలు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్ల కోసం అంకెల గారడీలకే పరిమితమైందన్నారు. వాస్తవ విరుద్ధంగా కేటాయింపు చేసి ప్రజలను మోసగించే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందించారన్నారు.

ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ తో సహా ఆరు కొత్త సంక్షేమ పథకాలకు ప్రకటించారన్నారు. పాత సంక్షేమ పథకాలకు నిధులు పెంచుతున్నట్లు చూపించారన్నారు.

కానీ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ లో సంక్షేమ కార్యక్రమాలకు చూపించిన నిధులను ఖర్చు చేయకుండా కోత విధంచడం చూస్తే ఇది ప్రజలను మోసగించే బడ్జెట్ అని తెలుతుందన్నారు.

2018 – 19 బడ్జెట్లో బిసి వెల్ ఫేర్ కోసం రూ. 6,213.17 కోట్లు కేటాయించగా సవరించిన బడ్జెట్ లో రూ. 5,356.70 కోట్లకు కుదించారన్నారు.

నిరుద్యోగభృతిని నెలకు రూ.1000 నుండి రూ. 2000 వరకు పెంచినా బడ్జెట్ లో మాత్రం గతేడాది రూ. 1000 కోట్లు కేటాయిస్తే దాన్ని ఈ ఏడాది రూ.1200 కోట్లు మాత్రమే పెంచారు

పెంచిన 20 శాతం కేటాయింపులతో 100 శాతం భృతి ఎలా పెంచుతారో వారికే అర్థంకా వాలన్నారు.

పసుపు- కుంకుమ కింద 93 లక్షల మంది మహిళలకు పదివేలు చొప్పున ఇవ్వడానికి సుమారు రూ. 9 వేల 300 కోట్లు అవసరం కాగా కేవలం నాలుగు కోట్లు మాత్రమే కేటాయించడమంటే మహిళలకు ఇచ్చిన చిక్కులు సగం చెల్లవని అర్థమోతుందన్నారు.

ప్రజలను మబ్బు పెట్టే బడ్జెట్……

రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటుంటే ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ బడ్జెట్లో ఎటువంటి పరిష్కారం చూపించలేదని (సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కే లోకనాధం అన్నారు.

ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలంటే వారి పంటలకు గిట్టుబాటు ధరలు, రుణభారం నుండి విముక్తి కి బడ్జెట్ లో ప్రతిపాదానలు లేవని ఆయన తెలిపారు.

అలాగే చాలీచాలని వేతనాలతో కూనరిల్లిపోతున్న అసంఘటిత రంగ కార్మికుల కోసం బడ్జెట్ ఎటువంటి కేటాయింపులు లేవన్నారు.

మొత్తం ప్రభుత్వ బడ్జెట్ లోతుగా పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలను మోసగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.

ఎన్నికల కోసం రూపొందించి ఈ అంకెల గారడీ బడ్జెట్ను ప్రజలు విశ్వాసించారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *