విధ్వంసం వృథా.. 361 రన్స్ టార్గెట్‌ని ఊదేసిన ఇంగ్లాండ్

361 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఆరంభం నుంచి చివరి వరకూ టాప్‌గేర్‌లోనే దూసుకెళ్లింది.
ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో తొలి వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జేసన్ రాయ్ (123: 85 బంతుల్లో 15×4, 3×6) ఆ తర్వాత రెండో వికెట్‌కి జో రూట్‌తో కలిసి రెండో వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
1.వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డేలో పరుగుల వరద
2.రికార్డు శతకం బాదిన క్రిస్‌గేల్.. అఫ్రిది అరుదైన రికార్డ్ బ్రేక్
3.361 పరుగుల ఛేదనలో జేసన్ రాయ్, జో రూట్ శతకాలు
4.మరో 8 బంతులు మిగిలి ఉండానే విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్
వన్డేల్లో ఇంగ్లాండ్ ఎంత ప్రమాదకరమైన జట్టో మరోసారి క్రికెట్ ప్రపంచానికి తెలిసింది.
గత నాలుగేళ్లలో మూడుసార్లు 400పైచిలుకు స్కోరు చేసిన జట్టుగా ఇటీవల రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్..
తాజాగా వెస్టిండీస్ నిర్దేశించిన 361 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఊదేసింది. ఇక రెండో వన్డే శుక్రవారం రాత్రి జరగనుంది.
బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు..
విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ (135: 129 బంతుల్లో 3×4, 12×6) శతకం సాధిండంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది.
గేల్‌తో పాటు ఆ జట్టులో షైహోప్ (64: 65 బంతుల్లో 7×4, 1×6), డారెన్ బ్రావో (40: 30 బంతుల్లో 2×4, 4×6) మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో 12 సిక్సర్లు కొట్టడం ద్వారా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డుల్లో నిలిచాడు.
ఇప్పటి వరకూ 476 సిక్సర్లతో పాకిస్థాన్ మాజీ హిట్టర్ అఫ్రిది అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా 488 సిక్సర్లతో క్రిస్‌గేల్ ఆ రికార్డుని కనుమరుగు చేశాడు.
361 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఆరంభం నుంచి చివరి వరకూ టాప్‌గేర్‌లోనే దూసుకెళ్లింది.
ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (34: 33 బంతుల్లో 6×4)తో తొలి వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జేసన్ రాయ్ (123: 85 బంతుల్లో 15×4, 3×6) ఆ తర్వాత రెండో వికెట్‌కి జో రూట్ (102: 97 బంతుల్లో 9×4)తో కలిసి రెండో వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆఖర్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (65: 51 బంతుల్లో 4×4, 3×6) కూడా బ్యాట్ ఝళిపించడంతో 48.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 364/4తో విజయాన్ని అందుకుంది. రికార్డుల పరంగా వన్డేల్లో ఇంగ్లాండ్‌కి ఇదే అతిపెద్ద ఛేదన..!!