జనసేన టికెట్ కోసం క్రికెటర్ దరఖాస్తు

జనసేన టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ కమిటీకి దరఖాస్తులు. జనసేన టికెట్ కోసం కమిటీకి దరఖాస్తు చేసుకున్న క్రికెటర్.

పవన్ సమక్ష్యంలో జనసేనలో చేరిన వేణుగోపాలరావు వచ్చే ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న వేణు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని దరఖాస్తు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు గుర్రాల వేటలో ఉంది జనసేన. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం సరికొత్త పంధాలో ముందుకు సాగుతోంది.

టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికి స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కళ్యాణ్.

పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కమిటీకి ప్రతి రోజూ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.

మంగళవారం కమిటీకి 150మందికిపైగా దరఖాస్తులు అందజేశారు. వీరిలో యువ క్రికెటర్ వేణుగోపాలరావు ఉన్నారు.

తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేణు కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరంకు తన బయోడేటాను అందజేశారు. తన వివరాలను ఆ బయోడేటాలో పొందుపరిచారు.

వేణుగోపాలరావుతో పాటూ మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జనసేన పార్టీ నేతలు బొలిశెట్టి సత్య, ముత్తంశెట్టి కృష్ణారావుతో పాటూ పలువురు జనసేన టికెట్ కోసం బయోడేటాలను అందజేశారు.

ఆ దరఖాస్తుల్ని పరిశీలించి వారి వివరాలు, రాజకీయ అనుభవం, అవగాహనను తెలసుకున్నారు. టికెట్ కేటాయింపుల్లో జనసేన అవలంభిస్తున్న విధానం చాలా బావుందంటున్నారు.

రాజకీయాల్లో అభ్యర్థిత్వం కోసం తమ పేరు పరిశీలించమని కోరేందుకు ఇంత స్వేఛ్చాయుతమైన వాతావరణం కల్పించిన పార్టీ ఒక్క జనసేనకు మాత్రమేనని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *