వాణి విశ్వనాథ్ పోయే… దివ్యవాణి వచ్చే…

తెలుగుదేశం పార్టీలో మహిళా నటీమణులు ఇలా వచ్చి అలా వెళ్లి పోవడం మనకు కొత్తేమీ కాదు కదా.
ఆవిర్భావం దగ్గరనుంచి ఈ సినిమా పాటలు హీరోయిన్ల గెస్ట్ అప్పియరెన్స్ లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ పార్టీలో హీరోయిన్లు కొంతకాలం పని చేయడం అవతల వాళ్ళ మీద హద్దుమీరి అదుపు లేకుండా మాట్లాడటం ఆ తరువాత చంద్రబాబు ని తిడుతూ బయటకు రావడం ఇది మనకు కొత్త కాదు కదా…
ఈ ప్రక్రియలో తాజా నటీమణి దివ్యవాణి. ఈ పెళ్లి పుస్తకం హీరోయిన్ ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలో ఈమె చేసిన ఓవర్ ఆక్షన్ చూసి ఈమేనా పెళ్లి పుస్తకం సినిమా హీరోయిన్ అని జనాలు నోరు వెళ్లబెట్టారు.
ఈమె ఓకే కానీ, తెలుగుదేశం పార్టీలో మొన్నటివరకు హడావుడి చేసిన వాణి విశ్వనాథ్ కనపడడం లేదు ఇప్పుడు.
తనకు ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చెప్పుకుంటూ టిడిపికి దగ్గరయింది వాణి విశ్వనాథ్.
నగరి నుంచి రోజా మీద పోటీ చేయడానికి కూడా ఉత్సాహం చూపించింది. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ మీద నిప్పులు చెరిగింది.
లక్ష్మి స్ ఎన్టీఆర్ కు కౌంటర్ సినిమాలో నటిస్తానని చెప్పింది.
అంత హడావిడి చేసిన వాణి తర్వాత పచ్చ పార్టీ కి దూరం అయినట్లుగా సమాచారం.
దాని లేకపోతేనేం దివ్యవాణి వచ్చింది కదా… పేర్లు కూడా దగ్గర దగ్గర గానే ఉన్నాయి.
మరి ఈ దివ్యవాణి హడావుడి ఏంటో ఎన్ని రోజులు చూడాలి మరి…