ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీకి ఆ పార్టీ సిద్ధపడుతోంది

తెలంగాణ జనసేన జోరు కనబరుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు.

ఇప్పటికే 12 లోక్‌‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీకి సై అంటోంది.

ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీకి ఆ పార్టీ సిద్ధపడుతోందితెలంగాణలో జనసేన జెండా.. పార్టీలను టెన్షన్ పెడుతున్న పవన్.

తెలంగాణలోని ఐదు పార్లమెంట్ కమిటీలను పవన్ కళ్యాణ్ సోమవారం ఏర్పాటు చేశారు. చేవెళ్ల, నిజామాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను జనసేన ప్రకటించింది.

ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం లోక్‌‌సభ నియోజకవర్గాలకు జనసేన కమిటీలను ప్రకటించింది. మెదక్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను జనసేనాని ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు పరోక్షంగా మద్దతు ప్రకటించిన పవన్.. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.

యువతలో జనసేన పట్ల క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ గణనీయంగా ఓట్లను సాధిస్తుందని భావిస్తున్నారు.

గెలుపోటములను జనసేన అభ్యర్థులు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలు ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *