తెలుగు, తమిళ భాషల్లో మలయాళీ హీరో కి హిట్స్…

ఫిబ్రవరి ఒకటో తేదీన తమిళంలో, ,’పెరన్బు’ విడుదలైంది. ఆ తర్వాతి వారం లో తెలుగులో’యాత్ర’విడుదలయ్యింది.
మినిమం బడ్జెట్లతో రూపొందిన ఈ సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. మమ్ముట్టికి రెండు పెద్ద హిట్స్ ఇవ్వడం విశేషం.
రామ్ దర్శకత్వంలో తమిళంలో పెరన్బు రూపొందింది. విడుదలకు ముందే ఫిలిం ఫెస్టివల్స్ లో ఆ సినిమా ప్రదర్శించడం జరిగింది.
కేవలం ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించడం ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.
కమర్షియల్గా కూడా ఆ డబ్బుని తిరిగి రాబట్టుకోవడం పెద్ద కష్టం గా మారలేదు.
ఇక పెరన్బుతో పోలిస్తే యాత్ర బడ్జెట్ కాస్త ఎక్కువే. మలయాళీ హీరో అయినా మమ్ముట్టి మీద భారీ ఇన్వెస్ట్ అంటే యాత్ర బడ్జెట్ అని చెప్పుకోవాలి.
అయినప్పటికీ ఇది వైయస్ కథ కావడంతో కమర్షియల్గా కూడా రూపకర్తలకు సంతృప్తిని మిగిల్చి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఒకే నెలలో తమిళంలో ఒక సినిమా, తెలుగులో మరో సినిమాతో ఫిట్స్ ను అందుకున్నాడు మమ్ముట్టి.
ఇదివరకు మమ్ముట్టి తమిళంలోనూ పలు సినిమాల్లో నటించాడు. దళపతి, ప్రియురాలు పిలిచింది, ఆనందం (తెలుగులో సంక్రాంతి), వంటి తమిళ సినిమాలతో మమ్ముట్టి విజయాలను అందుకున్నారు.
తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేసిన మమ్ముట్టికి యాత్రతో పెద్ద హిట్ లభించింది.