రేపే యాత్ర విడుదల… ‘మహి వి రాఘవ్’, ‘విజయ్ చల్లా’లకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ‘దిల్ రాజు’.

యాత్ర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర అందరికీ తెలుసు.

ఆ పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్ ని తీసుకుని కథ రెడీ చేసిన ‘మహి’ తో ‘విజయ్ చల్లా’ యాత్ర ని నిర్మించారు.

‘ముమ్మట్టి ‘లాంటి నటుడు నటించిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ అప్పుడు పాటలు వింటున్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా అనే ఎక్సైట్మెంట్ కనిపించింది.

‘మహీ వి రాఘవన్’ దర్శకత్వంలో, ‘మేక’ సమర్పణలో నిర్మించిన చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో’దిల్ రాజు’ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లతోపాటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఓపెన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అని అన్నారు.

ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉంటేనే రెవెన్యూ పరంగా సినిమాకి మంచి మ్యాజిక్ జరుగుతుందని అన్నారు మంచి ఓపెనింగ్స్ రావాలి… ఆ తర్వాత మంచి టాక్ రావాలి” అని చెప్పారు.

ఏదైనా సినిమాకి ఓపెనింగ్స్ ఎప్పుడు ముఖ్యమేనని కానీ ఇప్పుడు ఇది చాలా ముఖ్యమని అన్నారు. అడ్వాన్స్ బుకింగ్ లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.

ఈ సినిమా నైజాం వైజాగ్ ఏరియాలో మా సంస్థ విడుదల చేస్తుందని చెప్పారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మూమెంట్స్ ని ఆ రోజుల్లో టీవీ లో చూడడం లేదా పేపర్లలో చదవడమే ఉండేది. పాదయాత్రలో ఆయన హీరో అయిపోయారు

తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

జనాల కోసం ఏదైనా చేస్తానని పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు.

ఎన్టీ రామారావు గారు తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల ప్రజలు వైఎస్ గారికి అంత ఇమేజ్ వచ్చింది. ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ యాత్ర పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని దిల్ రాజు అన్నారు.

”విజయ్ చల్లా’ మాట్లాడుతూ “యాత్ర కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నామని చెప్పారు. విడుదలవుతుందంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు.

వైయస్సార్ జాతీయ నేత కావచ్చు… సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు.

ఈ సినిమా మొత్తానికి స్పిరిట్. వైయస్సార్ ఇది కేవలం ఆయన మాత్రమే కాదు ప్రేమించే వారు ఎవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అని చెప్పారు

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించడం గొప్ప విషయం చిత్రం చాలా కష్టపడింది.

దీన్ని మరో సినిమా తో పోల్చవద్దు వైయస్సార్ ప్రయాణంలో భావించి సెలబ్రేట్ చేసుకుందాం అని యాత్ర సినిమాని ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి రాఘవ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ఎన్టీఆర్’ మరియు ‘వైయస్సార్’ ఇద్దరు నేల తల్లి బిడ్డలు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవ పంచడానికి కాకూడదు.

నాకు వైయస్సార్, చిరంజీవి పైన ఉన్న అభిమానం ఎప్పటికీ తగ్గిపోదు.

మనకు స్ఫూర్తి నిచ్చిన వారి సినిమాలను సెలబ్రేట్ చేసుకుందామా అదే మనం వారికి ఇచ్చే గొప్ప నివాళి.

మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఇంకా మంచి కథతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తా. ధన్యవాదాలు తెలుపుతూ దిల్ రాజు ముగించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *