టీవీ నటి ఝూన్సీ ఆత్మహత్య

ప్రముఖ టీవీ నటి ఝూన్సీ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన ఇంటిలోనే ఆమె ఉరి వేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి ఆమె భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా ముదినేపల్లి కి చెందిన ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం గా చెబుతున్నారు.
మా టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘పవిత్ర బంధం’ అనే సీరియల్ లో ఝాన్సీ నటిస్తున్నారు.

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం తోనే ఝూన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సూర్య అనే వ్యక్తిని ఆరునెలలుగా ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, అతనితో పరిచయమయ్యాకే సీరియల్స్ మానేసి ఝూన్సీ నటనకు దూరమైందన్నారు.
గత కొద్దిరోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝూన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, వారు అంటున్నారు