సూచీలకు సర్జికల్ స్ట్రైక్ భయం

జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఐఓసీ, కోల్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

సెన్సెక్స్ 240 పాయింట్లు డౌన్.. 35,974 వద్ద ముగింపుప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లపై అమ్మకాల ఒత్తిడి45 పాయింట్ల నష్టంతో 10,835 వద్ద ముగిసిన నిఫ్టీ6 శాతానికి పైగా పెరిగిన జీ ఎంటర్‌టైన్‌మెంట్

బోర్డర్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు సహా అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లోనే ముగిసింది. రోజంతా సూచీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు గురయ్యాయి.

ఒకానొక సమయంలో సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు పతనమైంది. చివరకు సెన్సెక్స్‌ ఏకంగా 240 పాయింట్ల నష్టంతో 35,974 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,835 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

రూపాయి రివకరీ అవ్వడంతో ఐటీ, ఫార్మా షేర్లు లాభపడటం వల్ల సూచీల నష్టాలు కొంత తగ్గాయి.

నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఐఓసీ, కోల్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకంగా 6 శాతానికి పైగా ర్యాలీ చేసింది. టాటా మోటార్స్ 4 శాతానికి పైగా పెరిగింది.

అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, హీరో మోటొకార్ప్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం మేర పడిపోయాయి. రిలయన్స్ 1 శాతం తగ్గింది.

సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి.

నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *