విశాఖ జిల్లాలో పార్లమెంట్ బరిలోకి దిగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం సమీక్ష

Kamma brothers suspects other caste voters

Kamma brothers suspects other caste voters

ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో బరిలోకి దిగే అభ్యర్థుల ఆరాటం ఒకలా ఉంటే , పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఎవరు బరిలోకి దిగితే గెలుపు సులువవుతుందని నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా తన వేగాన్ని పెంచింది.

ఈ మేరకు ఆదివారం మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో చర్చ జరిగింది.

తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్కుమార్, గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ సమావేశంలో ఎంపీ అభ్యర్థిత్వాన్ని లోతుగా చర్చించడం జరిగింది.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున హరిబాబు ని రంగంలోకి దించి గెలిపించుకొగా, 2019 ఎన్నికల్లో ఎవరు తెలుగుదేశం తరపున రంగంలోకి దించాలని అంశం మే ప్రధానంగా సాగింది.

ఈ చర్చల్లో తొలుత ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ అభ్యర్థిత్వంపై ప్రారంభించారు, ఇప్పటికే భరత్ కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు గా తెలిసిందే.

అయితే సామాజిక వర్గంలో భరత్ కు అవకాశం లేని పక్షం లో అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ స్థానాల్లో బీసీ, కాపు సామాజిక వర్గాలకు కేటాయించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

భరత్ కాకుండా ఎంపీ అభ్యర్థిత్వం కోసం బీసీ ,కాపు వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు అనే ఆలోచనలోనే రెండు పేర్లను ప్రస్తావించగా వీరిలో ఒకరు బీసీ గవర విశాఖ డైరీ వ్యవస్థాపకులు ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్.

రెండో పేరు ఓ శాటిలైట్ ఛానల్ నిర్వహించిన బిగ్ బాస్ కార్యక్రమంలో విజేత కౌశిక్( కాపు )అయితే ఎలా ఉంటుందనే చర్చ వచ్చిందని తెలిసింది.

అయితే అనకాపల్లికి బీసీకి కేటాయిసై, విశాఖ కాపు సామాజికవర్గం నుంచి, లేదా అక్కడ కాపు కి కేటాయిస్తే ఇక్కడ బీసీ సామాజికవర్గం నుంచి ఒకరికి సీటు ఎంపీగా కేటాయించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లాలని మంత్రి గంటా ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *