కొణతాల అభిమానులు శ్రేయోభిలాషుల తో కొణతాల మనోగతం

మాకు పార్టీలతో సంబంధం లేదు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం, ఇది మాజీమంత్రి ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అనుచరుల మనోగతం.

అనకాపల్లి లో స్థానిక రింగ్ రోడ్ లోని క్యాంప్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఉత్తరాంధ్ర అజెండా 2019 ఎన్నికల పేరుతో నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించారు.

మాడుగుల, నర్సీపట్నం, పెందుర్తి, చోడవరం, అనకాపల్లి, గాజువాక నియోజకవర్గాల నాయకులతో వేరువేరుగా మాట్లాడారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాల అనుచరులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.

బుధవారం ఎలమంచిలి, పాయకరావుపేట, అరకు ,పాడేరు నియోజకవర్గాలకు చెందిన వారితో సమావేశం అవుతారు అనంతరం అక్కడి నుంచి అమరావతి కి బయలుదేరి వెళ్తారు.

గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంది అక్క నుంచి వచ్చిన తర్వాత అనకాపల్లి లో భారీ సభ ఏర్పాటు చేసి అక్కడ రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.

వైయస్సార్ పార్టీ నుంచి ఎందుకు పంపారు, ఎందుకు రమ్మంటున్నారు కొందరు వైకాపా నేతలు వచ్చి పార్టీలో చేరినమని అడుగుతున్నారని కొణతాల చెప్పారు.

తాను పార్టీకి రాజీనామా చేసి బయటకు రాలేదని చెప్పారు.

అప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు, ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నారు అంటే వారి వద్ద సమాచారం లేదన్నారు.

విజయమ నుంచి ఆహ్వానం వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు పార్టీ నేత ఇంతవరకు తనతో నేరుగా మాట్లాడలేదన్నారు.

కొణతాల తన మనసులోని భావాలను అభిమానులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *