వచ్చే ఎన్నికల్లో పోటీచేయనంటున్న రాజమండ్రి ఎంపీ మురళీమోహన్

ఎన్నికల్లో పోటీ చేయనంటున్న మరో టీడీపీ ఎంపీ వచ్చే ఎన్నికల్లో పోటీచేయనంటున్న రాజమండ్రి ఎంపీ మురళీమోహన్.
తన కుటుంబం నుంచి కూడా ఎవరూ బరిలోకి దిగరని ప్రకటన. తన ట్రస్ట్ సేవలన్ని విస్తృతపరుస్తానన్న మురళీ మోహన్.
టీడీపీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతాను. బాబు ఆదేశిస్తే ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేస్తా వయసు రీత్యా పోటీచేసే పరిస్థితిలో లేను. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలు, ఎంపీలు ఒక్కొక్కరిగా పోటీకి దూరమంటున్నారు. ఇటీవలే వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని కాకినాడ ఎంపీ తోట నర్సింహం ప్రకటిస్తే..
తాజాగా రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా అదే నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తి లేదని.. బరిలో ఉండనని చెప్పారు.
ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు కూడా చెప్పానన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ ఇచ్చారు.
తనకు 80 ఏళ్లని.. వయసు రీత్యా కూడా పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. తన కోడలకి కూడా టికెట్ ఆశించడం లేదని.. టీడీపీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే రాష్ట్రమంతటా ప్రచారం చేస్తానన్నారు.
తాను ఏ తప్పూ చేయలేదని.. తన వ్యాపారాల విషయంలో ఎవరికీ భయపడబోనంటున్నారు. తన ట్రస్ట్ సేవలన్ని విస్తృతపరుస్తానని మురళీ మోహన్ తెలిపారు.
మురళీమోహన్ మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు.
తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
మురళీ మోహన్ పోటీ నుంచి తప్పుకోవడంతో చంద్రబాబు ధీటైన అభ్యర్థి వేటలో ఉన్నారు.