మా’ ఎన్నికల్లో వేలుపెట్టిన శ్రీరెడ్డి.. అటాక్ స్టార్ట్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్

(మా) కాలపరిమితి ముగియడంతో మార్చి 10 ఎన్నికలకు సిద్ధం అయ్యారు.

ఇప్పటిదాకా ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా..

  • 1.రంజుగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.
  • 2.మార్చి 10న ఎన్నికలు.
  • 3.రెండు గ్రూపులుగా ప్యానల్ ఫామ్ చేసిన నరేష్, శివాజీ రాజాలు.

నరేష్ ప్యానల్‌పై విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి చూస్తూ ఊరుకోనని హెచ్చరిక అసలే హాట్ హాట్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడిలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎంట్రీ ఇవ్వడం మరింత రంజుగా మారింది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కాలపరిమితి ముగియడంతో మార్చి 10 ఎన్నికలకు సిద్ధం అయ్యారు.

ఇప్పటిదాకా ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. సెక్రటరీగా వ్యవహరించిన హీరో నరేష్ ఈసారి అధ్యక్ష పదవిని సొంతం చేసుకునేందుకు సొంత ప్యానల్ పెట్టేశారు.

జీవిత రాజశేఖర్‌లు నరేష్ ప్యానల్‌లో కీలక పదవుల కోసం పోటీలో ఉన్నారు. యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్న ‘మా’ ఎన్నికలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. నరేష్ ప్యానల్‌ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి.

గతంలో టాలీవుడ్ క్యాస్టింగ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి వ్యవహారశైలిని బహిరంగంగానే తప్పుపట్టారు జీవిత.

అప్పట్లో శ్రీరెడ్డి, జీవితల మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఇదిలాఉంటే.. తాజాగా నరేష్ ప్యానల్‌లో జీవిత రాజశేఖర్‌లు కీలకపదవుల కోసం పోటీలో నిలబడటాన్ని ఇన్ డైరెక్ట్‌గా తప్పుపడుతూ హీరో నరేష్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

నరేష్ గారు మీరంటే గౌరవమే కాని.. ఎవరికి పట్టం కడదాం అనుకుంటున్నారు. మీరు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు.

మీ పక్కన కూర్చున్న వాళ్ల వ్యక్తిత్వాల గురించి ఆలోచించారా?

వాళ్లు అన్ని విషయాల్లోనూ మంచి వ్యక్తులు కాదు.

దీనికి నేను ఒప్పుకోను. సైలెంట్‌గా ఉండలేను.

దయచేసి ప్యానల్‌ని స్పాయిల్ చేయొద్దు’ అంటూ జీవిత రాజశేఖర్‌లతో నరేష్ కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసింది శ్రీరెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed