అంతం చేయాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు

  • 1.నన్ను అంతం చేయాలని చూస్తున్నారు: మోదీ
  • 2.తనను అంతం చేయాలని ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
  • 3.దేశ భద్రత అంశాలపై రాజకీయం చేస్తూ పాక్‌కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ సహా పలు పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నాలో ఆదివారం నిర్వహించిన ఎన్డీయే సంకల్ప ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కొందరు తనను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు.

‘నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నాయి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా చేస్తున్న వ్యాఖ్యలను పాక్ నేతలు చక్కగా వాడుకుంటున్నారన్నారు.

బాలాకోట్‌లో చేసిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలంటూ ప్రతిపక్షాల వ్యాఖ్యాలను ఆయన తప్పుబట్టారు.

మన దేశంలో అలజడులు రేకెత్తిచేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

పేదలు, సంక్షేమం పేరిట రాజకీయ దుకాణాలు నడుపుకుంటూ కుటుంబాన్ని బాగుచేసుకోవడం తప్ప ఇంకేమీ తెలియని కొందరు నాయకులకు కాపలాదారులతో చిక్కేనంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కాపలాదారుడిపై విమర్శలు చేసేందుకు పోటీపడుతున్న ప్రతిపక్షాలకు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని మోదీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed