పవన్ గెలిస్తే సీఎం అవుతాడు.. ఓడితే సీఎంకి మొగుడౌతాడ…రామ్ గోపాల్ వర్మ.

‘ఓరి మందులోడా.. ఓరి మాయలోడా.. వర్మా’.. మా కళ్యాణ్ అన్న మీద ఈ రోజు చాలా ప్రేమ వచ్చింది ఏంటి సంగతి?

నీ సినిమా ప్రమోషనేగా.. నీకు ఇప్పుడే చెప్పారా బ్రహ్మంగారు? ఆయన పాలిటిక్స్‌కి వచ్చినప్పుడే మాకు తెలుసులే..

పవన్ కళ్యాణ్‌పై వర్మ ఆసక్తికరకామెంట్స్సడెన్‌గా పవన్‌ నైజం, నిజాయితీ, పవర్‌లను గుర్తు చేసుకున్న వర్మ భిన్నంగా స్పందిస్తున్న జనసైనికులు వైరల్ అవుతున్న వర్మ లేటెస్ట్ పోస్ట్‌.

టైటిల్ చూస్తే.. ఇంత ఘాటుగా స్పైసీగా ఏకేవాడు.. ఏపీ కోసం పీకేని పొగిడేదైనా.. తిట్టేవాడెవడైనా ఉన్నాడంటే అది ఇంకెవరు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మేగా.

తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్‌లు పేల్చేడు రామ్ గోపాల్ వర్మ.

నిన్న మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, జనసేన పార్టీపై విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మకు సడెన్‌గా పవన్ నైజం, నిజాయితీ, పవర్‌లు గుర్తుకు వచ్చాయి.

‘సీబీఎన్.. పీకేని గత ఎన్నికల్లో అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో నారా చంద్రబాబు నాయుడుని ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం’ అంటూ ఓ పోస్ట్ వదిలిన వర్మ ఆ వెంటనే మరో పోస్ట్ పెట్టాడు.

‘బ్రహ్మం గారు నాకు చెవిలో చెప్పంది.. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీలో సీఎం అవుతాడు..

గెలవకపోతే గెలిచిన సీఎంకి మొగుడౌతాడు.. తదాస్తు’ అంటూ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఓరి మందులోడా.. ఓరి మాయలోడా.. వర్మా’.. మా కళ్యాణ్ అన్న మీద ఈ రోజు చాలా ప్రేమ వచ్చింది ఏంటి సంగతి?

నీ సినిమా ప్రమోషనేగా.. నీకు ఇప్పుడే చెప్పారా బ్రహ్మంగారు? ఆయన పాలిటిక్స్‌కి వచ్చినప్పుడే మాకు తెలుసులే.. అంటూ జనసైనికులు వర్మకి కౌంటర్‌లు ఇస్తున్నారు.

నిజానికి వర్మ ఏ పోస్ట్ పెట్టినా దాని వెనుక కారణం లేకుండా ఉండదు.. ఇక తన సినిమా లైన్‌లో ఉందంటే.. ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తాడు.. ఎవర్నైనా తిడతాడు.. ఎవర్నైనా పొగుడుతాడు..

ఆయనకు కావాల్సింది ఫుల్ పబ్లిసిటీ.. ఫ్రీ ప్రమోషన్. ఎవర్ని కెలికితే ప్రమోషన్ వస్తుందో.. ఎవర్ని పొగిడితే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందో వర్మకు వోడ్కాతో పెట్టిన విద్య. సో.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు ముందు తన అస్త్రాలను బయటకు తీస్తున్నాడు వర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed