ఈ ప్రశ్నలకు బదులేది… నరేంద్ర మోడీ జీ..

Modi - 10% reservation bill

Modi - 10% reservation bill

ప్రధాని నరేంద్ర మోడి తన మాటలతో మాయ చేయడం కొత్తేమీ కాదు.

2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని, విభజన చట్టానికి నుంచి ఆంధ్రప్రదేశ్ కి అన్ని చేస్తామని చెప్పిన మోడీ, 2019 ఎన్నికలకు ముందు ఏపీలో కీలకమైన పర్యాటన చేశారు గానీ… అప్పటికీ ఇప్పటికీ పెద్ద గా మారింది ఏమీ లేదు.

ఆయన మాటల్లో ఇప్పటికీ అదే మాయ కనిపిస్తోంది. మాటలు కోటలు దాటేస్తుంటే, చేతులు కనీసం గడపదాటని పరిస్థితి నరేంద్ర మోడీది.

ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడూ అటకెక్కించిన మోదీ నుంచి, గుంటూరు సభలో ప్రత్యేక హోదాపై హామీ వస్తుందని ఎవరైనా ఆశించగలరా…? చాన్స్ లేదు.

కానీ, మోడీ ఆ ప్రత్యేక హోదా ను మించి ఆంధ్ర ప్రదేశ్ కి అన్ని చేశామని ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టారు… అంటూ మోదీ ప్రకటించుకున్నారు గాని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదు మాత్రం చెప్పలేకపోయారు.

అదొక్కటే కాదు మిగతా వాగ్దానాలు కూడా, స్టీల్ ప్లాంట్ విషయంపై పెదవి విప్పలేదు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ కి సంబంధించిన నిధులను ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రం వెనక్కి తీసుకోవటం పైన మోడీ నుంచి ఎటువంటి వివరణ రాలేదు.

అసలు, నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ కి ఎందుకు వచ్చారు.? అని ఆరా తీస్తే కేవలం చంద్రబాబు ని తిట్టడానికే అని మోడీ గుంటూరు సభ ద్వారా తెలిసింది.

చంద్రబాబు ని మోడీ విమర్శించాల్సిందే. కానీ, ఆ విమర్శ లో సగ భాగం తనకు చెందిందె అని మోడీ మర్చిపోయినట్లున్నారు.

నాలుగేళ్ల పాపం చంద్రబాబుతో సహా నరేంద్ర మోడీ కూడా కలిసి మెసి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో కూరుకు పోయిందన్నదే నిజమైతే,ఆ అవినీతిలో నరేంద్ర మోదీ వాటా ఎంతన్నది తేలాలి కదా.

ప్రత్యేక హోదా దండగని నరేంద్ర మోడీ చెబితే, చంద్రబాబు’అవును కదా..!’ అంటూ బాకా ఊదారు.

నాలుగేళ్లు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పబ్లిసిటీ స్టంట్ లు చేస్తే, ఇది మోడీ ‘సెహబాష్’ అంటూ చంద్రబాబుని పొగిడారు.

ఇప్పుడు సీన్ మారింది. ఇద్దరు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. గుంటూరు కి వచ్చి మోడీ, బాబు ని కడిగి పారేస్తే..’నన్ను తిట్టడానికే మోదీ వచ్చినట్లున్నారు.. అంటూ చంద్రబాబు ఎగతాళి చేశారు.

ఇక్కడ చంద్రబాబు కి గాని, మోదీ కి గాని పెద్దగా నష్టం ఏమీ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజిస్తే, ఆ తర్వాత మోదీ చంద్రబాబు మీ ఒక తాటిపైకి వచ్చి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ తో మరింతగా ఆటలాడుకున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తో పండగ చేసుకున్న మోడీ పోలవరం ప్రాజెక్టు తాలూకు ప్రాముఖ్యత అర్థం కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

బుల్లెట్ ట్రైన్ దేశానికి అవసరమట మరి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అమరావతి అవసరం లేదా.? ఇలా ఈ ప్రశ్నకి మోడీ దగ్గర సమాధానం లేదు,వుండదు కూడా…

నల్ల జెండాలతో, మల్ల బెలూన్లతో నిరసన, వ్యతిరేకత తెలిపిన, నరేంద్ర మోడీ కి అర్థం కావాలని ఎలా అనుకోగలం.. అర్థమయ్యే వాటిని’ఆశీర్వాదాలుగా … దిష్టి చుక్కలుగా’మోదీ చెపుతున్నారంటే.. దిగజారుడు రాజకీయాలకు ఇంతకన్నా పరాకాష్ట ఇంకేముంటుంది చెప్పండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *