ఏపీలో కులాల కుంపటి… అన్నీ ఒక్కటే..

ఆంధ్ర ప్రదేశ్ లో కుల రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాల్ని కుల రాజకీయాలను పండించడానికి నానా తంటాలు పడుతున్నారు.

ఈ తరుణంలో తప్పు మీద తప్పు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్నికల కమిషన్ ను కలిసిన సందర్భంగా సంచలన విషయాలను బయటపెట్టారు ‌.

చంద్రబాబు ప్రభుత్వం విపక్షం మద్దతుదారులు ఓటర్లను తొలగించడం, బోగస్ ఓట్లను చేర్పించడం వంటి వాటితో పాటు ఏకంగా తమకు అనుకూలంగా ఉండే పోలీసు అధికారులకు ఏకపక్షంగా ప్రమోషన్లు ఇచ్చిన తీరు ఆధారాలతో సహా బయట పెట్టడం తీవ్ర కలకలం రేపింది.

ఏకంగా తమ సామాజిక వర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్లకు 37 మందికి గాను 35 మందికి ప్రమోషన్లు ఇచ్చాడు. విషయం ఏమిటంటే కాపు నేత నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా ఉండగా, ఆయనను డమ్మీ ని చేసి చంద్రబాబు ఈ రకమైన ప్రమోషన్లు ఇవ్వడం తీవ్ర అభ్యంతరంగామారింది.

దీనివల్ల ఆంధ్రా సమాజం మరింత కలుషితం అవుతోంది.

ఏపీని కులాల కుంపటి గా ఇప్పటికే మార్చిన ప్రభుత్వం ఈ ప్రమోషన్లు అన్నీ ఒకే కులం వారికి అది కూడా తన సొంత కులం వారికి ఇచ్చేసి తీరని ఆ ప్రచారం చేసింది.

డిజిపి కాని, హోంమంత్రి కాని, ఈ ప్రమోషన్లు ఇలా ఇంతమంది ఒకే కులం వారికి ఇవ్వలేదని కానీ వారందరికీ మంచి ఫోకల్ పోస్టింగ్లు ఇవ్వలేదని కానీ చెప్పలేకపోయారు. మెరిట్ మీద ప్రమోషన్లు ఇచ్చామని చెప్తున్నాను.

అంటే మిగిలిన కులాలలో ఈ పార్టీ మీద ఎవరికీ లేదని చెప్పదలిలరా..? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎంతోకొంత పక్షపాత ధోరణులు లేకుండా కాలం సాగదు కదా మరి..

కానీ మరీ ఇంత బరితెగింపు గా, ప్రమోషన్లు, పోస్టింగ్లు ఇచ్చారంటే చంద్రబాబు వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నంద్యాలలో కొందరు పోలీసు అధికారులతోనే టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

అదే స్కీమొను రాష్ట్రమంతటా ముఖ్యంగా విపక్షం బలంగా ఉన్న చోట ప్రయోగించాలని చేస్తున్నారు అనుకోవాలి.

సాధారణ ఎన్నికలలో అది అంత తేలిక కాదు.

ఈ పరిణామం వల్ల పోలీసుశాఖలోనే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడుతుంది.

డి.ఎస్.పి టిడిపికి అనుకూలంగా పని చేయాలని చెప్పిన, కింద ఉన్న సి ఐ, ఎస్ ఐ వంటివారు వినాలని గ్యారంటీ ఏమీ లేదు కదా.

పైగా ఇంత కుల పక్షపాతం చూపించిన తరువాత వారికి మాత్రం అభిమానం ఉంటుంది కదా.

వారు ఎంత కాలం భయపడతారు అన్న ప్రశ్న వస్తుంది.

చంద్రబాబు ప్రయోగం వల్ల మరో సమస్య కూడా వస్తుంది. ఆయన సామాజిక వర్గం వారికి మిగిలిన సామాజిక వర్గాలు అన్ని వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటుంది.

అప్పుడు హరిహరాదులు దిగివచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గెలవడం అసాధ్యమైన విషయం.

నిజానికి సమాజానికి ఇది మంచిది కాదు. కానీ అధికారమే పరమావధి గా, ఎన్నో వేల కోట్లు అయినా ఖర్చు చేసి , ఏ అరాచకమైన చేసి, గెలవాలన్న లక్ష్యంతో ఉన్న పాలకులు విజ్ఞాత కోల్పోతారు అనిపిస్తుంది.

నిజానికి గతములో తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలనుండి, విమర్శల నుండి ఎదుర్కోలేదు.

కానీ 2014లో ఆచరణ సాధ్యం కాని 600 హామీలు ఇచ్చి, అన్ని కులాల వారికి ఏదో ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుడు వాటిని అమలు చేయలేక, ఇలాంటి పెడ ధోరణులకు వెళ్తున్నారు అనుకోవాలి.

ఇప్పటికే కాపులను ఆయన దూరం చేసుకున్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం లో కాపు నేతలను ప్రభుత్వం ఎంతగా అవమానించింది చూసాం కదా.

పైగా కాపు రిజర్వేషన్ల పేరుతో కాపులకు, బీసీలకు మధ్య ఘర్షణలు సృష్టించారు.

ఇక బీసీల నైనా గౌరవంగా చూశారా అంటే అదీ లేదు.

ఒక బీసీ లాయర్ జడ్జి కాకుండా చేయడానికి ఆయన రాసిన లేఖ బీసీ వర్గాల ఆత్మాభిమానం దెబ్బతీసింది. సచివాలయం లోకి వస్తారా అని వారిని అవమానించారు.

మత్స్యకారులను తీవ్రంగా హెచ్చరించి వారిని దూరం చేసుకున్నారు.

బోయలను ఎస్టీలతో చేర్చుతామని, రజకులను ఎస్సీల తో చేర్చుతామని హామీలు ఇచ్చి వారిని మోసం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇక దళితులల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని వ్యాఖ్యానించి వారి ఆగ్రహానికి కూడా గురయ్యారు.

ఇక కాపులను బీసీలలో చేస్తానన్న హామీని పక్కన పెట్టి,వారికి కేంద్రం ఇచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వారి కోట నుంచి 5 శాతం ఇవ్వడం ద్వారా మిగిలిన కులాలకు, కాపులకు మధ్య ద్వేషాలను తీసుకుని వచ్చారు.

పైగా రాజ్యాంగం ప్రకారం చెల్లదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.

కాపులను మాయ చేయబోయి, మిగిలిన అగ్రవర్ణాలను దూరం చేసుకోవడానికి ఈ చర్య దోహదపడవచ్చు.

ఆయా కులాలకు కార్పొరేషన్లలు ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు.

విపక్ష నేత జగన్ స్కీం లను కాపీ కొట్టిన, అవి ఎంతవరకు ఆయనకు ఉపయోగపడతాయో తెలియదు.

ఈ రకంగా ఆయా కులాల వారితో తగాదాలు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రమోషన్లలు ఇచ్చి, సమాజంలో ఆ కులం పట్ల ద్వేష భావం పెరిగేలా చేయడం దారుణంగా ఉంది. ‌

తద్వారా ఆయనకు కానీ, ఆ సామాజిక వర్గానికి కానీ ప్రతిష్ట కాదని చెప్పక తప్పదు.

ఆంధ్ర సమాజానికి మరింత చేటు తేవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి తప్ప మేలు చేకూర్చువు.

విపక్ష నేత జగన్ స్కీం లను కాపీ కొట్టిన, అవి ఎంతవరకు ఆయనకు ఉపయోగపడతాయో తెలియదు.

ఈ రకంగా ఆయా కులాల వారితో తగాదాలు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రమోషన్లలు ఇచ్చి, సమాజంలో ఆ కులం పట్ల ద్వేష భావం పెరిగేలా చేయడం దారుణంగా ఉంది. ‌

తద్వారా ఆయనకు కానీ, ఆ సామాజిక వర్గానికి కానీ ప్రతిష్ట కాదని చెప్పక తప్పదు.

ఆంధ్ర సమాజానికి మరింత చేటు తేవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి తప్ప మేలు చేకూర్చువు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *