మోదీ సభకు వైసిపి జనాలట…! పచ్చ ప్రచారం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సంగతి తెలిసిందే.., అప్పట్లో ఆ కార్యక్రమం కోసం టిడిపి ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దాదాపు 1000 కోట్ల ఈ కార్యక్రమం ప్రచారం కోసం ఖర్చుపెట్టినట్లు అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది.

చంద్రబాబు కింద మీద పడిన, మోడీ మాత్రం చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమే తీసుకొచ్చి ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్ కి.

నిజానికి, అప్పట్లోనే వైఎస్సార్సీపి అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం పైన, చంద్రబాబుపైన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోడీ, చంద్రబాబు కలిసే అన్యాయం చేస్తున్నారు మండిపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం అంటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కానీ, చంద్రబాబు ఏం చేశారు? ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పదే పదే అవమానిస్తూ వచ్చారు. ప్రత్యేక హోదా దండగని చెప్పారు.

చెప్పడం అంటే హోదా కోసం ఎవరు మాట్లాడినా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు, ఎన్నికల సమీపిస్తున్న వేళ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తే, చంద్రబాబు మొహం చాటేస్తున్నారు. ఎందుకు? అంటే, బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాం..

రాష్ట్ర ప్రజలు కోసమేనని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. పై గా, నరేంద్ర మోడీ సభకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనాల్ని తరలించాడు అంటూ చంద్రబాబు అండ్ టీమ్ ‘పచ్చ’ప్రచారం షురూ చేసింది. వైయస్ జగన్ కి హైదరాబాదులో ఏం పని అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించ సాగారు.

అప్పుడు నరేంద్ర మోడీని వైయస్ జగన్ వెనకేసుకు రాలేదు… ఇప్పుడు నరేంద్ర మోడీకి మద్దతుగా వై ఎస్ ఆర్ సి పి వ్యవహరించడంలేదు. అప్పట్లో చంద్రబాబు పదే పదే ఒకే మాట చెబుతూ ఉండేవారు…’మేం ఎన్ డి ఏ నుంచి బయటకు వస్తే, వైయస్సార్సీపి అందులో దూర దాము అనుకుంటోంది…’అని. చిత్రంగా బిజెపి నేతలు కూడా ఇలాంటి మాటలే వినిపించేవారు.

టిడిపి, ఎన్డీయే ని వీడితే వైయస్ఆర్ సీపీ తమ వద్దకు రావాలనుకుంటోందని, ఎన్డీయే లోకి వైయస్ఆర్సీపీని రానివ్వబోమని బీజేపీ నేతలు అప్పట్లో సెలవిచ్చారు.

అప్పటికీ ఇప్పటికీ వైయస్సార్సీపి వాదన అలానే ఉంది. ప్రత్యేక హోదా విషయంలోనూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై విమర్శల విషయంలోనూ.

హైదరాబాద్ నుంచి అమరావతి కి వచ్చి ప్రధానికి ప్రతిపక్ష నేత నిరసన తెలపాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏం చేశారు..? ప్రధాని పర్యటనను ఆయన అడ్డుకోగలిగారు..? ప్రత్యక్షంగా నిరసన తెలపగలిగారా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి, టిడిపి నేతలతో నిరసనలు చేయించి సరిపెట్టేశారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ విషయంపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లు మోదీ విషయంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోనూ, ఒకటికి వందసార్లు చంద్రబాబు మాట మార్చిన వైనానికి సంబంధించిన వీడియోలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి‌, అయినా చంద్రబాబు బుకాయిస్తున్నారు..

రాజకీయంగా అక్రమ సంబంధాలు నడుపుతూ తన పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు, వైయస్ జగన్ కి రాజకీయ అక్రమ సంబంధం అంటగట్టేందుకు చూడడం ఏమిటట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *