జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం.. దేవుడి దయతో అంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం జగన్ మంత్రులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సీఎం అందరితో ప్రతిజ్ఞ‌ చేయించారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 71వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జగనన్న పచ్చతోరణంను ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపేటలో ప్రారంభించారు.

సీఎం జగన్ మంత్రులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సీఎం అందరితో ప్రతిజ్ఞ‌ చేయించారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్. మొత్తం 20కోట్ల మొక్కులు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

ఇక రాష్ట్రవ్యాప్తం క్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గాజులపేటలో 33 ఎకరాల లేఅవుట్‌ చేసి, 1600 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

ఇక్కడ ఎకరా కనీసం రూ.3 కోట్లు ఉంటుందన్న ఆయన, చదరపు గజం విలువ రూ.5 వేలు అని తెలిపారు.

అంత మంది పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వడ, వారు తమ ఇంటి స్థలం వద్ద చక్కగా చెట్లు నాటడం చూస్తే ఆనందం వేస్తోందని చెప్పారు.

ఆగస్టు 15న పట్టాల పంపిణీ

‘ఏ రకంగా టీడీపీ వాళ్లు కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు. చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటున్నారు. దాన్ని నివారించడం కోసం ప్రభుత్వం చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా అడ్డుుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్ధితుల్లో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. అయితే దేవుడి దయతో ఆగస్టు 15న రాష్ట్రమంతా 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాం. రాష్ట్రమంతా 1.48 కోట్ల ఇళ్లు ఉంటే, ఇప్పుడు 30 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలం ఇస్తున్నాం అంటే దాదాపు 20 శాతం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

90 రోజుల్లో ఇస్తాం

అర్హులెవరైనా మిగిలిపోతే, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. రాష్ట్రమంతా దాదాపు 13 వేల గ్రామ పంచాయితీలు ఉంటే, 17 వేల లేఅవుట్లు చేసి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని సీఎం వివరించారు.
ఆ తర్వాత మొక్కలు నాటడంపై అందరితో ప్రమాణం చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *