ఏపీ నుంచి నలుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం..ఆయన మాత్రం రాలేదు

ఏపీ వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణం.. ఆయన మాత్రం రాలేదు
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇతర రాష్ట్రాల సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. బుధవారం ఛైర్మనె వెంకయ్యనాయుడు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు.
తర్వాత ఇతర రాష్ట్రాల సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇదిలా ఉంటే మరో వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.
మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఏపీ నుంచి నలుగురు సభ్యులు (ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని) ఎన్నికయ్యారు.