జగన్ స్వార్ధం వెనక పరమార్ధం ఇది… దీన్ని ఏమని అంటారు?

“నేటి బాలలే రేపటి పౌరులు” ఈ లైన్ ఎక్కడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు విన్న మాట!

ప్రతీ ఏటా బాల దినోత్సవం నాడు పెద్దలు అనబడేవారు చేసే ప్రసంగంలో మొదటి మాట! ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే వాగ్దానాల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి వింటున్న మాట!

కానీ… చేతల్లో ఏది? ఒకరిపై ఒకరు చూసుకోవడం, తలలు కిందకు దించుకోవడమే ఈ ప్రశ్నకు సమాధానం! కానీ… మారాయి.. రోజులు మారాయి.. పాలన మారింది.. ఫలితంగా ప్రజల ఆలోచనా దృక్పథం కూడా మారింది.. జగన్ వచ్చిన తర్వాత!

“ఈపూటకు గడిచిపోతే చాలు” అనుకునే పాలకులున్న ఈ రోజుల్లో.. నేడు ఎంత ముఖ్యమో, రేపు అనేది మరీ ముఖ్యం.. అని నమ్మి… సమస్యలు, మార్పులు అనేవి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రారంభమవ్వాలని మరింత నమ్మిన జగన్.. అందుకు ముందుగా ఎంచుకున్నది “అందరికీ అందుబాటులో సరైన విద్య”!

గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పాఠశాల పతనం ప్రారంభమయ్యి, అంచులకు చేరుతున్న తరుణంలో… జగన్ అధికారంలోకి వచ్చారు. రావడం రావడం ప్రైవేటు పాఠశాల ఆగడాలకు అడ్డుకట్టాలు వేయడంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎన్నడూ ఉహించని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు!

ఈ విషయంలో రాష్ట్రంలోని పిల్లలందరికీ వారి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఉన్నతమైన విద్యను అందించ నిర్ణయించారు. దానికోసం రకరకాల పథకాలు అందిస్తున్నారు.

అయితే ఈ విషయంలో జగన్ విజన్ కి, జగన్ ఆలోచనా సరళికితోడుగా… తల్లితండ్రుల మద్దతు తోడయితే… దేశంమొత్తంలో ఏపీ ఒక ఉన్నతమైన రాష్ట్రంగా అన్ని రంగాల్లోనూ నిలవడానికి నేడు పునాది వేసినవారవుతారు అనడంలో సందేహం లేదు!

పిల్లల ఫీజు తానే చెల్లిస్తాడు.. పిల్లలను పాఠశాలకు పంపినందుకు అమ్మకు డబ్బులు ఇస్తాడు..

మధ్యహ్నం భోజనం తానే పెడతాడు.. స్కూలుకి వెళ్లడానికి యూనిఫాం తానే ఇస్తాడు.. కాలికి షూ కూడా తానే ఇస్తాడు.. పాఠశాలలకు వెళ్లడానికి రవాణా ఖర్చులు తానే చెల్లిస్తాడు.. జగన్ ఇన్ని చేస్తుంటే తల్లితండ్రులు ఏమి చేయాలి?

తల్లితండ్రులు చేయాల్సిందల్లా… తమ పిల్లలను పాఠశాలకు పంపడం.. సరైన క్రమశిక్షణతో పెంచడం.. ఉన్నతమైన భావాలున్న వ్యక్తులుగా తీర్చిదిద్దడం.. సమాజానికి ఉత్తమ పౌరులను అందించడం! జగన్ అన్ని చేస్తున్నప్పుడు… బాధ్యతగల పౌరులుగా తల్లితండ్రులూ ఆమాత్రం చేయలేరా? చేస్తారు… చేయాలి… ఎందుకంటే అలా చేయడం వల్ల వారి వారి పిల్లల భవిష్యత్తు బాగుండటంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది.. ఫలితంగా దేశ భవిష్యత్తూ బాగుంటుంది.. అది జగన్ స్వార్ధం… కాదు కాదు జగన్ స్వార్ధం లోని పరమార్ధం!! అందరూ పథకాలను ఓట్లకోసం పెడుతుంటే… జగన్ పథకాలను “రేపటి కోసం” పెడుతున్నారు… దీన్నే “విజన్” అంటారు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *