దొంగ ఓట్లను చేర్చడం ఉన్న వోట్లను తొలగించడం అన్యాయం అని నెల్లూరు సమర శంఖారావం సభలో జగన్ విమర్శ

Jagan to declare 100 Assembly candidates at one go!
రాష్ట్రంలో దొంగ ఓట్లను తోలిగించమని ఎక్కడికక్కడ పారo 7 పెట్టి
అడిగామని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి నుంచి రాష్ట్ర అధికారుల వరకు అందరిని కలిసి విన్నవించామన్నారు.
దొంగ ఓట్లను చేర్చడం ఉన్న వోట్లను తొలగించడం లాంటి అన్యాయమేనా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మంగళవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని వీ జి ఎస్ కళాశాల మైదానంలో జరిగిన సమర శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు.
తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం నాతో నడిచి ఎన్నో కేసులు భరించారు, మీ అందరి ఆశీస్సులతో మన పాలన వచ్చాక ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తా.
రాష్ట్రంలో 59 . 16 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి ,అందులో 39 లక్షల ఓట్లు మన రాష్ట్రంలోనే ఉండగా మరో 20 లక్షల ఓట్లు తెలంగాణకు చెందినవి ఉన్నాయి.
ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడిగే ధైర్యం ఆయనకు లేదు ఆయనకు ఓటు వేయరన వారి ఓట్లను తొలగిస్తారు.
వీటిపై ఎన్నికల కమిషన్కు మనం ఫిర్యాదు చేస్తే దొంగే దొంగ అని అరిచినట్లు మన పైన ఎదురుదాడి చేస్తున్నారు.
నా చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి ఓటు కూడా తొలగించాలని అర్జీ పెట్టారు ,ఇలా ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు కోసం దరఖాస్తులు ఇచ్చారు.
ఓటర్ల సమాచారాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ కి అప్పగించడం నేరం అవుతుంది ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫోటో ల ఓటర జాబితాను ఒక ప్రైవేట్ కంపెనీ కి ప్రభుత్వం ఇచ్చింది.
మీ బ్యాంక్ ఖాతా నెంబరు చంద్రబాబు తెలుసు, మీ చెక్కు పుస్తకం ,ఆధార్ నెంబరు ఆయనకు తెలుసు ,ఇలాంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు కు చెందిన ప్రైవేట్ కంపెనీలో వారి కంప్యూటర్ లో దొరుకుతున్నాయి అంటే అర్థం చేసుకోండి.
ఇటువంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే దొంగతనం అంటారు,
చంద్రబాబు తన కొడుకును ఐటీ మంత్రిగా పెట్టుకొని blue frog, it grids అనే రెండు బినామీ కంపెనీలకు ప్రజల సమాచారం మొత్తం ఇస్తున్నారు.
ఆ కంపెనీలు తయారు చేసిన సేవమిత్ర ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితా కు సంబంధించిన పూర్తి వివరాలు అందులో ఉన్నాయి.
ఈ కంపెనీలు ఎవరవి ఈ కంపెనీలో యజమానులతో ఉన్న సంబంధం ఏంటి.
ప్రభుత్వ సమాచారం ప్రైవేట్ కంపెనీ కి ఎందుకు ఇచ్చారు.
అంటూ ఆయా కంపెనీల పె తెలంగాణలో సోదాలు జరిగితే క్షణాల్లో సమాచారాన్ని కంపెనీల యజమానులు చంద్రబాబుకు వాట్సప్ చేశారు.
సున్నితమైన ప్రజల డేటా చంద్రబాబు బినామీ కంపెనీల దగ్గర ఉంటే ఆయన్ని బజారున పెట్టాల్సింది పోయి, భుజానికెత్తుకున్నారు కారణం బాబు అక్రమాలపై విచారణ జరగకూడదు, బాబు కుట్రలకు ఆ ఎల్లో మీడియా సహకరిస్తుంది.
వైకాపా అధికారంలోకి వస్తే ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరిలో. సంతోషాన్ని నింపుతామని జగన్ పేర్కొన్నారు