వాల్తేరు డివిజన్ సాధనకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష

ఆంధ్రులను అపహాస్యం చేయడం ప్రధాని మోదీ భాజపా నాయకులకు అలవాటు అయిందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం జిల్లా పలాస, గుంటూరు సభలో భాజపా నాయకులకు ఆంధ్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్తారొ తెలుసుకున్న ప్రధాని విశాఖ సభకు వచ్చే ముందు అలాంటి పరిస్థితి రాకూడదని ముందుగానే రైల్వే జోను ప్రకటించారు.
అసంబద్ధంగా వాల్తేరు డివిజన్ ను రద్దు చేశారు.
ఇది ఎలా చేసారో ప్రతి ఒక్క రి కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు.
వాల్తేరు డివిజన్ ను అసంబద్ధంగా రద్దు చేయడం పై ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైలు నిలయం లో మంగళవారం 15 గంటలపాటు దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర కు ఎంత అన్యాయం జరిగినా ప్రతిపక్ష నాయకుడికి పట్టడం లేదు.
పైగా అపహాస్యం చేస్తూ వారికి వంత పాడుతున్నాడని ధ్వజమెత్తారు.
విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోసమని అది మాయా జొన్ అని వాల్తేరు డివిజన్ తో కూడిన విశాఖ జోన్ కావాలని డిమాండ్ చేశారు.
అందులో ఇచ్చాపురం వరకు ఆంధ్ర ప్రాంతం అంతా ఉండాలని ఆ విషయం ప్రధానికి తెలియజేసేందుకే ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం ప్రారంభించామన్నారు.
మంగళవారం ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ నివాసం నుంచి కవిటి మీదుగా ఇచ్ఛాపురానికి భారీ ప్రదర్శన గా వచ్చి ఎంపీ ఇచ్చాపురం రైలు నిలయం వద్ద సాయంత్రం ఐదింటికి దీక్ష ప్రారంభించారు.
వైకాపా తప్ప అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు, సుదీర్ఘ చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కోరుతున్నాయని దాన్ని సాధించేందుకు ఎంతవరకైనా పోరాడతామని ఉద్యమకారులు స్పష్టం చేశారు