అనంతపురం జిల్లాలో ఈసారి వైసీపీ పార్టీ మొత్తం స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాలు వేస్తోంది

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ స్పష్టమైన హవా కొనసాగిస్తోంది అన్ని సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి.

ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది జగన్ పాదయాత్ర. ఈ నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇప్పటికే వైసీపీ పార్టీ వైపు ప్రజలంతా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి అర్థమవుతుంది.

ముఖ్యంగా ఆ ప్రాంతంలో మహిళా మంత్రిగా ఉన్న ఆ మంత్రి పై ఇటీవల పర్యటనలోనూ జిల్లా ప్రజల తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పార్టీ గత ఎన్నికల్లోనే చాలా బలంగా ఉంది.

ఒక అనంతపురం జిల్లాలో తప్ప గత ఎన్నికలలో రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలలో వైసీపీ పార్టీ స్పష్టమైన మెజారిటీ స్థానాలు గెలుచుకుంది.

అయితే రాబోతున్న ఎన్నికలలో అనంతపురం జిల్లాలో ఈసారి వైసీపీ పార్టీ మొత్తం స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాలు వేస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల ఇడుపులపాయలో అసెంబ్లీ సెగ్మెంట్ల స్థానాలను పార్లమెంటు స్థానాలను ప్రకటించిన జగన్ అనంతపురం జిల్లాలో చాలా బలమైన క్యాండెట్ లను నిలబెట్టడంతో…ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి గత ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావటం జిల్లాలో సరైన అభివృద్ధి చేయకపోవడం మొత్తం ఈ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో వైసీపీ జెండా మెజార్టీ స్థానాల్లో పాగా వేస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా జగన్ : చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారీ

ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన ప్రతి పేదవాడికి అండగా తాను ఉన్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

తన 3648 కి.మీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నానని, వారి సమస్యలను దగ్గరుండి చూశానని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం, అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సోమవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు.

ప్రభుత్వానికి మంచి మనసుంటే ప్రతి ఇంటికీ మంచిచేయాలని కోరుకుంటుందని, టీడీపీ ప్రభుత్వానికి మాత్రం అదిలేదని మండిపడ్డారు.

పేదవాడు సంతోషంగా బతకడానికి ఏం కావాలో తన పాదయాత్రలో తెలుసుకున్నానని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిని అందిస్తానని హామీ ఇచ్చారు.

ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని, రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనే ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మరోసారి మోసపోద్దని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పాదయాత్రలో మహిళలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో చూశాను. వాటిని చూసి చలించిపోయాను.

చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి పేదవాడి మీ సమస్యలను నేను విన్నాను, చూశాను. వారందరికీ మాట ఇస్తున్న నేనున్నాను.

గత ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని, పొదుపు రుణాలు మాఫీ చేస్తానని, ఉద్యోగాలు ఇస్తామని ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.

మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చి.. దానిని విస్మరించి.. ప్రతి గ్రామంలో బెల్డ్‌షాపులను తెరిపించారు.

మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలుగు విడతల్లో మద్యపానం పూర్తిగా నిషేధిస్తాం. చదవుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికూడా ఇవ్వలేదు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డా. చంద్రబాబు దానిని కూడా తాకట్టుపెట్టారు.

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవి. దానిని కూడా నిర్మించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *