ఐ ఆర్ జూన్ నుండి అమలు: మహిళా అవుట్సోర్సింగ్-కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలపై వరాల వర్షాన్ని కురిపించింది.ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కీలక నిర్ణయాలు.

అదేవిధంగా కాంట్రాక్ట ఉపాధ్యాయులు, లెక్చరర్లకు టైం స్కేల్ వర్తింప చేసేలా నిర్ణయం ప్రకటించింది.

మధ్యంతర భృతి జూన్ నుండి…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగాలు వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అంచనా. పి ఆర్ సి నివేదిక ఇచ్చేందుకు ఇంకా సమయం పట్టం ఉన్నందున.

ఉద్యోగాలకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. 2018 జులై 1 నుంచి ఇది వర్తిస్తుంది. పెంచిన ఐ ఆర్ ని వచ్చే జూన్ నుంచి ఉద్యోగాలకు అమలు చేస్తారని వెల్లడించారు.

అయితే తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ తో పాటు ఇతర సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానించారు. మరిముఖ్యంగా 12 నెలల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సోర్సింగ్ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పై కూడా వరాల జల్లు కురిపించింది.

ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల తరహాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వనున్నారు.

ఇక రాష్ట్రంలో ప్రాథమిక ఉన్నత విద్య లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లు .

అదేవిధంగా ఇంటర్, కేజీబీవీ, యూనివర్సిటీలో ఉన్నత పాఠశాలలో ఎక్కడ పని చేసే వారైనా వారికి టైం స్కేల్ వర్తింప చేయనున్నారని క్యాబినెట్ సమావేశంలో వెల్లడించారు.

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఒక పది రోజులు మినహా 12 నెలల జీతం చెల్లించేందుకు, మెటర్నటీ లీవ్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది.

వారిని 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగంలో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదంలో చనిపోతే రూపాయలు ఐదు లక్షలు,సహజ మరణము అయితే రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది.

వీరందరికీ హెల్త్ కార్డ్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

1998, 2008 డి ఎస్సీ నోటిఫికేషన్ లలో ఎంపికై ఉద్యోగాల కోసం తిరుగుతున్న వారికి న్యాయం చేకూరాలని వారిలో ఇంకా ఉద్యోగాల్లో చేరకుండా ఖాళీగా ఎవరున్నారు గుర్తించి వారికి విద్యా మిత్ర తదితర పోస్టులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *