మోడీ పై చంద్రబాబు నాయుడు సంచలనమైన పిలుపు

ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను నిర్వీర్యం చేయడానికి ప్రధాని మోడీ ఏపీ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చంద్రబాబు మోడీ ఏపీ పర్యటన గురించి ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్ష దేశానికే దిక్సూచి అని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ,భావితరాల భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ చేస్తున్న ఈ పోరాటానికి అందరికీ సంఘీభావం ఉందన్నారు.

ఢిల్లీలో దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో కూడా దీక్షలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకుని ప్రతి ఒక్కరూ నిరసనలు పాల్గొనాలని సూచించారు.

ప్రధాని మోదీ గుంటూరు పర్యటన సందర్భంగా నిరసన దినంగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి నేతలకు పిలుపునిచ్చారు.

ఆదివారం ఒక దుర్దినమని , చీకటి దినంగా సీఎం అభివర్ణించారు.పుండు మీద కారం చల్లడం ఇక మోడీ ఏపీ పర్యటన కోస్తున్నారని చెప్పారు.

చేసిన దుర్మార్గానికి చూసేందుకే మోడీ వస్తున్నారని ఇక్కడున్న దుర్మార్గుడు సహకరిస్తున్నారని పరోక్షంగా జగన్మోహన్రెడ్డిపై ఏపీ సీఎం మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నారని, నాయకత్వాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాఫెల్ బురదలో మోడీ కూరుకుపోయారని, ఈ వ్యవహారంలో పి ఎం ఓ జోక్యం చేసుకుని దేశానికి అదృష్టం తెచ్చారని చెప్పారు.

మోడీ అడుగులు ఆంధ్రప్రదేశ్లో పవిత్రం చేస్తాయని అన్నారు.

టిడిపి శ్రేణులంతా పసుపు చొక్కాలు, నల్ల చుక్కలతో నిరసన తెలపాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

అలాగే పసుపు బెలూన్స్ ను, నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన ప్రకటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *