సినిమా నటులు వారి బయోపిక్ లు తీయడం లేదా పుస్తకాలు రాయడం టాలీవుడ్ లో ఏడాదికి అరడజను వస్తూనే ఉంటాయి.

పాత పేపర్లు, కటింగ్ లు ముందు వేసుకుని, ఫోటోలతో నింపేసి, అటు ఇటు నాలుగు ప్రకటనలు జోడించి వదుల్తూ నే ఉంటారు. కనిపించిన వాళ్ళందరికీ చేతిలో పెడతారు వాటిని చూసి అలా పక్కకి పెట్టేస్తూ ఉంటారు.‌

అలా కాకుండా తెలుగు వాళ్ల గురించి అందులో తెలుగు నటుల గురించి, సీనియర్ బయోగ్రఫీ రాసే ప్రయత్నాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.

అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తనదైన శైలితో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్ మీద బోల్డన్ని పుస్తకాలు వచ్చాయి ఇకముందు కూడా వస్తూనే ఉంటాయి.

ఆ మహానటుడు ఎన్టీఆర్ మీద తన రెండో భార్య లక్ష్మీపార్వతి కూడా కొన్ని పుస్తకాలు రచించారు.

ఈ మేటర్ ని సీరియస్ గా తీసుకున్న ఇద్దరు హై అఫీషియల్ ఇంగ్లీష్ లో ఓ ప్రణాళిక తో రూపొందిన ఓ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు.

ఐఆర్ఎస్ అధికారి చంద్రహాస్, ఐ ఎ ఎస్ అధికారి లక్ష్మీనారాయణ కలిసి అందించిన ఈ పుస్తకం చాలా సమగ్రంగా, సవివరంగా ఉంది.

దాదాపు ఆరు నుంచి ఏడు వందల పేజీలు ఉన్న ఈ పుస్తకం ఇది. పుస్తకం కాసేపు అలా అలా కొన్ని పేజీలు తిరగేస్తే చాలు మనకి అర్థమైపోతుంది ఆ పుస్తకం ఆషామాషీగా రూపొందించలేదని. దాని వెనక ఎంతో కృషి పట్టుదల ఉన్నాయ్ అని అర్థమవుతుంది.

కొన్ని విశేషాలు

ఎన్టీఆర్ కు”మన దేశం”చిత్రంలో తొలి అవకాశం కల్పించింది ఎల్.వి.ప్రసాద్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

దీనికి ముందే ఎన్టీఆర్ ను”విద్యా రాణి”అనే చిత్రంలో హీరోగా నటించడానికి ప్రముఖ దర్శక నిర్మాత సి.పుల్లయ్య తీవ్ర ప్రయత్నాలు చేశారు.

అయితే అంతకు ముందే ఇంటర్మీడియట్ రెండుసార్లు తప్పి మూడవ ప్రయత్నంలో పాస్ అయిన ఎన్టీఆర్ డిగ్రీ పూర్తయ్యేదాకా ఎక్కడికి వచ్చేది లేదని సి.పుల్లయ్య అంతటి దర్శకుడి ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. ఇది చాలా మందికి తెలియని విషయం.

*సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ బాంబే వెళ్లి అక్కడ”ఆంధ్ర మెస్”అని హోటల్ పెట్టి కొద్ది రోజులు రన్ చేశారు. ఇది ఎవరికీ తెలియని విషయం.

*ఎన్టీఆర్ సబ్ రిజిస్టార్ ఉద్యోగం చేయడం కంటే ముందు ఆమెన్ ఉద్యోగం చేశారు. అంటే కోర్టులో నిందితుల పేర్లను మూడు సార్లు పిలిచి ఉద్యోగం అనమాట.

కేవలం 11 రోజులు చేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారట. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు.

*సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ రకరకాల పనులు చేశారు. హోటల్స్ కు పాలు సప్లై చేయడం, కోర్టు లో 11 రోజులు ఆమెన్ ఉద్యోగం చేయడం, బబ్బురి వెంకటయ్య అనే ఒక పార్ట్నర్ తో కలిసి పొగాకు, బీడీ, సిగరెట్లు హోల్ సేల్ షాపు నడపడం వంటి పనులు చేసి తండ్రికి ఆర్థికంగా సహాయపడే వారట ఎన్టీఆర్.
*

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తన ఇంట్లో అద్దెకుంటున్న సూర్యనారాయణ అనే అతన్ని పెద్ద కూతురితో ఎన్టీఆర్ కు ఫస్ట్ క్రష్ ఏర్పడింది.

అది గమనించిన పెద్దలు మందలించడంతో ఆ “తొలిప్రేమ”జ్ఞాపకం గానే మిగిలిపోయింది.

సినిమాలకు సంబంధించినంత వరకు ఇలాంటి ఎన్నెన్నో విశేషాలు వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఇక రాజకీయ రంగంలోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ తెచ్చిన మార్పులు, చేపట్టిన పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలు వంటివి సమస్త విషయాల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు.

పరిణామాలకు ప్రత్యేక సాక్షులుగా కాకుండా వాటన్నిటినీ పర్యవేక్షించడం ఉన్నతాధికారుల రచయితల కావటం వల్ల ఈ పుస్తకం పారదర్శకతను ప్రశ్నించే అవకాశం లేదు.

మొత్తం మీద ఎన్టీ రామారావు అంతటి ఒక సంచలనాత్మక వ్యక్తి చరిత్రను అక్షరబద్ధం చేసినప్పుడు ఏ ఒక్క విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు అనే సంకల్ప సిద్ధితో ఈ పుస్తకంలోని ప్రతి పేజీ రూపొందించారు రచయితలు.

ఈ పుస్తకం తెలుగులో వస్తే తెలుగు పాఠకులకు కూడా చేరువవుతుందని తెలుగు పక్షులకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *