మరోసారి చంద్రబాబును నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. టీడీపీకి నూకలు చెల్లాయి అంటూ వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

పగలో పార్టీ తో- రాత్రి పార్టీ తో కాపురం చేస్తుంది.

బీజేపీతో టిడిపి తెగతెంపులు ఓ డ్రామా

అందుకే వైఎస్ జగన్ పథకాలను బాబు కాఫీ కొడుతున్నాడు.

బీజేపీ తో తెగదెంపులు చేసుకున్నామని చెబుతూ… ఇంకా లోపాయకారీ సంబంధాలు నడుపుతూనే ఉందని దుయ్యబట్టారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న టీడీపీకి నూకలు చెల్లాయి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Bosta satya Narayana fire on TDP

ఒక్కసారి సాయం చేసిన బీజేపీని మర్చిపోకూడదని… జీవితాంతం దండాలు పెడుతూనే ఉండాలంటూ ఓవైపు టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు అంటుంటే, మరోవైపు బీజేపీ దేశాన్ని భ్రఘ్టపట్టించిందని చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదం గా ఉందన్నారు.

బీజేపీ, టీడీపీ రెండూ కలిపి రాష్ట్రానికి అన్యాయం చేశాయని మండిపడ్డారు. టీడీపీ పగలు కాంగ్రెస్ తో, రాత్రి బీజేపీ తో కాపురం చేస్తోందన్నారు. టీడీపీ మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.

ఇలాంటి పార్టీని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. రైతులు ప్రజలకు న్యాయం చేయాలన్న . చిత్తశుద్ధి టిడిపికి ఏమాత్రం లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే రూ. 2 వేల పెన్షన్ పెంపు, ట్రాక్టర్లు, ఆటోలకు పన్ను మినహాయింపు తదాతరాలను వైయస్ జగన్ ఎప్పుడో ప్రకటిస్తే వాటిని చంద్రబాబు ఇప్పుడు కాఫీ కొడుతున్నాడని దుయ్యబట్టారు.

ఇది తాము సాధించిన మొదటి విజయమన్నారు. ప్రజల సంక్షేమ పట్టా అంత చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగున్నరేళ్లుగా ఎందుకు చేయలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. టీడీపీ పని అయిపోయిందని… అందరూ తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని బొత్స పేర్కొన్నారు.

ప్రజలు టీడీపీ ని తిరస్కరించారని, ఎప్పుడు ఎన్నికలస్తాయా అని వారు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పూర్తిగా అప్పుల్లోకి నెట్టేశారు అని దుయ్యబట్టారు. ఒక్క చోట కూడా అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు. ఆయన ఏది చెప్పినా ప్రజలు నమ్మే స్తారనే భ్రమల్లో చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. గతంలోనూ ఇదే తరహాలో బిల్లు పెట్టినట్టు, కేంద్రానికి పంపినట్టు డ్రామాలాడారని గుర్తు చేశారు.

ఇది ఆచరణ సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఎందుకు ఇలా మోసం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కేంద్రంలో ఉన్నప్పుడే ఇలాంటివి చేసి ఉంటే ప్రజలు నమ్మే వారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *