ఎన్నికల ప్రకటన వచ్చేలోగా మరిన్ని పథకాలు

వీలైనన్ని కొత్తవి ప్రకటిస్తాం: సీఎం చంద్రబాబు అతి విశ్వసం వద్దని టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నేతలకు హెచ్చరికలు

ఎన్నికల ప్రకటన వెలువడేలోగా వీలైనన్ని కొత్త పథకాలను ప్రకటిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు రక్ష, డోక్రా మహిళల కు నగదు సాయం పథకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

ఉండవల్లి లోని గ్రీవెన్స్హాలులో సోమవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమేవేశంలో పార్టీ నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికలకు ముందు ఇంకా ఏం చేయాలనే అంశంపై సూచనలు ఇవ్వాలని పార్టీ నేతలను కోరారు. రాబోయే ఐదేళ్లకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి టీడీపీ ఎన్నికలు మేనిఫెస్టో ప్రకటిస్తాం అన్నారు.

కెసిఆర్వి నాటకాలు:
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరిగినట్లు హడావుడి చేశారని చంద్రబాబు విమర్శించారు. కోల్కతాలో జరిగిన సభకు ఇరవై రెండు పార్టీలు హాజరయితే కేసీఆర్ రాలేదని, ఆయనవన్ని నాటకాలు అని వ్యాఖ్యానించారు.

వైయస్సార్సీపి తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని, పెన్షన్ రూ.2 వేలకు పెంపు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి షర్మలతో ఫిర్యాదులు చేయించారని , కెసిఆర్- జగన్ సమావేశం అందులో భాగమేనని ఆరోపించారు . మోడీ పాలన దేశాన్ని అప్పుల్లో ముంచిందని, రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ రెచ్చగొట్టాలని చూసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఏపీలో పెన్షన్ పెంపు వల్ల ప్రజలో సంతృప్తి 66.52 శాతం నుంచి 71.18 శాతానికి పెరిగిందన్నారు. చుక్కల భూములు సమస్య పరిష్కారంలో జాయింట్ కలెక్టర్ విఫలం కావడంతో ఇబ్బందులు వచ్చాయన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతల ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సొంత ఆలోచనలతో కాకుండా పార్టీ నిర్ణయాల ప్రకారం వ్యవహరించాలని సమావేశంలో చంద్రబాబు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *